పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఛాలు..ఫ్యాన్స్ లో ఉత్సాహంతో పాటు.. అవాంచనీయ సంఘటనలు కూడా కామన్. కెజియఫ్2 విషయంలో కూడా అదే జరిగింది. కాని కాస్త లేట్ గా జరిగింది.
పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఛాలు..ఫ్యాన్స్ లో ఉత్సాహంతో పాటు.. అవాంచనీయ సంఘటనలు కూడా కామన్. కెజియఫ్2 విషయంలో కూడా అదే జరిగింది. కాని కాస్త లేట్ గా జరిగింది.
భారీ బడ్జెట్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే చాలు ఎక్కడో అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటనలు కామన్ గా జరుగుతుంటాయి. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ విషయంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఇక వెరీ రీసెంట్ గా రిలీజ్ అయిన కెజియఫ్ ఛాప్టర్2 రిలీజ్ తరువాత అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైమ్ లో ఓ సంఘటలన ఫ్యాన్స ను ఉలిక్కిపడేలా చేసింది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో.. కన్నడ యంగ్ తరంగ్ యష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెజియఫ్2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ భాషలో సంచలనం సృష్టిస్తూ.. భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తోంది. ఒక్క హిందీలోనే దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది కెజియఫ్2. ఇంకా కలెక్షన్ల సునామీ కొనసాగిస్తూనే ఉంది సినిమా. ఇక ఈ క్రమంలోనే కెజియఫ్ నడుస్తున్న ఓ థియేటర్ లో ఓ సంఘటన ఉలిక్కి పడేలా చేసింది.
తెరపై కేజీఎఫ్2 నడుస్తోంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. కానీ అవే కాల్పులు ఉన్నట్టుండి థియేటర్లోనే జరిగాయి. స్క్రీన్ మీద చూస్తున్నవి తమ కళ్ల ముందే జరగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఇదంతా కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
ఓ థియేటర్ లో సెకండ్ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో చిన్న గొడవ కాస్తా పెద్దది అయ్యింది. చాలా సేపు పెద్దగా గొడవ పడ్డారు ఆ ఇద్దరు వ్యాక్తులు. ఇక అతను బయటకు వెళ్లి పిస్టల్‌తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. ఈ సంఘటనతో థియేటర్ లో అంతా భయబ్రంతులకు గురయ్యారు. అయితే కాల్పులు జరిపిన దుండగుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
