గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. 


భారతదేశం అంతా ఆశ్చర్యపోయి చూసేలా ముంబై లో జరుగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పరిణయ మహోత్సవానికి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు నుంచి కూడా మహేష్ ,రామ్ చరణ్ వంటి స్టార్స్ ఫ్యామిలీలతో వెళ్లారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఉపాసనతో కలిసి కొన్ని ఫొటోలకు పోజులిచ్చిన రామ్ చరణ్... విడిగా మరికొన్ని ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనలను అంబానీ వర్గాలు ఆత్మీయంగా స్వాగతించాయి.

రామ్ చరణ్ ఉపాసన( Upasana ) ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించటాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఉపాసన చీరలో( Upasana Saree ) ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఈ క్రమంలో ఈ వివాహంలో ఉపాసన కట్టిన అవుట్ ఫిట్ ఎంత రేటు ఉండవచ్చు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆమె జయంతి రెడ్డి రూపొందించిన బీజ్ ఎంబ్రాయిడరీ సిల్క్ అనార్కలి సెట్‌ను ధరించారని తెలుస్తోంది. ఈ సెట్ ధర రూ. 1,49,900 అని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వివాహ వేడుకల్లో భాగంగా ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్ బంద్ గలా సూట్ ధరించగా, ఉపాసన గాగ్రా డ్రెస్ లో తళుక్కుమన్నారు. రామ్ చరణ్, ఉపాసన... నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయితే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నారు.