`గూఢచారి 2` బిగ్ అప్‌డేట్.. పోస్టర్ అదిరింది.. యాక్షన్‌లోకి దిగుతున్న అడవి శేష్
`మేజర్`, `హిట్2`తో వరుస విజయాలు అందుకున్న అడవిశేష్ ఇప్పుడు మరో క్రేజీ మూవీతో రాబోతున్నారు. ఆయన నటిస్తున్న `గూఢచారి2` నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

అడవి శేష్ నటించిన `గూఢచారి` సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు అడవిశేషుని యాప్ట్ గా మార్చేసింది. సూపర్ హిట్‌గా నిలిచిన ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. `గూఢచారి2` ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్. సినిమా పోస్టర్‌ని రిలీజ్ చేసింది.
`జీ2`(గూఢచారి2) పేరుతో ఈ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మెషిన్ గన్ పట్టుకుని బ్లాక్ సూట్‌లో ఉన్న అడవిశేష్ ప్రీ లుక్ ఆకట్టుకుంటుంది. మోస్ట్ స్టయిలీష్‌గా ఉంది. శేష్ యాక్షన్‌కి రెడీ అవుతున్నట్టుగా ఉంది. సినిమాపై జస్ట్ పోస్టరే అంచనాలను పెంచేస్తుంది. నెట్టింట రచ్చ లేపుతుంది. మొదటి సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయిత జనవరి 9న ఈ సినిమాకి మరో మేజర్ అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నారు. ప్రీ విజన్ పేరుతో వీడియోని విడుదల చేయబోతున్నారు. ఎపిక్ యాక్షన్ అడ్వంచర్‌గా సినిమాని తెరకెక్కిస్తున్నారు. జనవరి 9న ఢిల్లీ, ముంబయిలో ప్రీ విజన్ వీడియోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మేజర్` చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శశికిరణ్ తిక్క సహకారం అందించారు. ఈ సినిమాకి అడవిశేష్ కథ అందించడం విశేషం.
`గూఢచారి` కథ ఇండియాలో సాగగా, ఇప్పుడు `గూఢచారి2` అంతర్జాతీయంగా సాగుతుందని, ఆల్ఫ్స్ పర్వతాలలో గూఢచారి ముగిసిన ప్రదేశం నుంచి రెండో పార్ట్ ప్రారంభమవుతుందని వెల్లడించింది యూనిట్. మొదటిదానితో పోల్చితే ఇదే కథ పరంగా, యాక్షన్ పరంగా, కాస్టింగ్ పరంగా రెట్టింపుగా, భారీగా ఉంటుందట. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతుందని సమాచారం. `మేజర్`, `హిట్2` విజయాలతో దూకుడుమీదున్న అడవిశేషు నుంచి వస్తోన్న సినిమా కావడం, పైగా విజయవంతమైన సీక్వెల్ కావడంతో `గూఢచారి2`పై భారీ అంచనాలున్నాయి.