అత్తారింట్లో అడుగుపెట్టిన పరిణీతి చోప్రా, సర్ ప్రైజ్ ఇచ్చిన రాఘవ్ ఫ్యామిలీ..
పెళ్ళి హనీమూన్ తరువాత మొదటి సారి అత్తారింట్లో అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురు పరిణీతి చోప్రాకు .. రాఘవ్ ఫ్యామిలీ నుంచి సర్ ప్రైజింగ్ వెల్కం లభించింది. ఇంతకీ ఎలా వెల్కం చెప్పారంటే..?

బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra),ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)ల ప్రేమ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో సెలబ్రిటీలతో పాటు... ఇద్దరు సీఎంలు కూడా సందడి చేశారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్ లోని చాలా ఖరీదైనదిగా పేరున్న లీలా ప్యాలెస్ (Leela Palace)లో వీరి పెళ్లి జరిగింది. అది కూడా పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
పెళ్ళి తరువాత వీరి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పరిణీతితో పాటు.. రాఘవ్ చద్దా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.కాగా, పెళ్లి తరువాత అత్తారింట్లో అడుగు పెట్టిన పరిణీతి కి గ్రాండ్ వెల్కం లభించింది. కొత్త కోడలు మొదటిసారి రాబోతుండటంతో చద్దా కుటుంబం ఆమెకు సర్ ప్రైజింగ్ వెల్కం చెప్పారు. అది చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఇంటిని ఎంతో అందంగా అలంకరించి.. ప్రత్యేకంగా స్వాగతం పలికింది చద్దా ఫ్యామిలీ. దీంతో పరిణీతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అనంతరం సాంప్రదాయబద్దంగా అత్తింట్లో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా చద్దా కుటుంబం చేసిన సందడి అంతా ఇంతా కాద.. కొత్త జంట మధ్య ఎన్నో ఫన్నీ గేమ్స్ పెట్టగా.. పరిణితి అందుల చురుగ్గా పాల్గొని అందరి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ గేమ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాఘవ్-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు.
ఈపెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.