Asianet News TeluguAsianet News Telugu

గౌతమిపుత్ర శాతకర్ణి కి దుబాయ్ లో హ్యాండ్

  • మెగా, నందమూరి సినిమాల పోటాపోటీ ఎత్తులు
  • థియేటర్ల కోసం నువ్వా నేనా అని తలపడిన మెగాస్టార్, నందమూరి హీరో
  • దుబయ్ లో థియేటర్లు దొరక్క దెబ్బైపోయిన గౌతమిపుత్ర శాతకర్ణి
GPSK NOT RELEASED IN DUBAI

సంక్రాంతి కానుకగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లు రికార్డులు తిరగరాస్తున్నాయి. అయితే.. కలెక్షన్లలో తేడాకు కారణం రెండు సినిమాలు కొన్నిచోట్ల అన్యాయానికి గురికావడమే కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల‌కూ కొన్ని కొన్ని విష‌యాల్లో ద్రోహం జ‌రిగింద‌న్న‌ది తెలుగు సినీ జ‌నాల మాట‌. అంటే థియేటర్లు కేటాయింపులో తేడాలొచ్చాయని బహిరంగంగానే వాపోతున్నారు ఇర వర్గాల వారు. మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 దర్శకుడు వినాయ‌క్ నిన్న‌టి ప్రెస్ మీట్‌లో `మా సినిమాకి అన్యాయం జ‌రిగింద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు` అంటూనే ఎవరూ అలా అనుకోవద్దంటూ...కవరింగ్ ఇచ్చాడు. మెగా వర్గం వాదన ఇలా ఉంటే నందమూరి బాలకృష్ణ సినిమా టీమ్ కూడా తమమకు అన్యాయం జరిగిందంటోంది.

 

దుబాయ్‌లో తెలుగు సినిమాల‌కు దుబాయ్‌లో పిచ్చ క్రేజ్‌. ఎందుకంటే అక్క‌డ తెలుగు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళ్తిన‌వాళ్ల సంఖ్య దుబాయ్‌లో బ‌లంగా ఉంది. స్టార్ హీరోల సినిమాల‌కు అక్క‌డ క‌ళ్లు చెదిరేలా వ‌సూళ్లు ద‌క్కుతాయి. చిరు సినిమాకీ అక్క‌డ భారీగా వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఎటొచ్చి అన్యాయ‌మైపోయింది బాల‌య్య సినిమానే. గౌత‌మిపుత్ర శాత‌కర్ణి దుబాయ్‌లో విడుద‌ల కాలేదు. దానికి కార‌ణం… దుబాయ్‌లో థియేట‌ర్లు దొర‌క‌లేదు. ముంద‌స్తుగా అక్క‌డున్న థియేట‌ర్ల‌న్నీ ఖైదీ నెం.150 కోసం బుక్ చేసేశారు.

 

ఒక్క‌టంటే ఒక్క థియేట‌ర్ కూడా గౌత‌మి పుత్ర‌కి ద‌క్క‌లేదు. వారం రోజుల పాటు అన్ని థియేట‌ర్ల‌న్నీ ఖైదీ సినిమా కోసం బ్లాక్ చేశారు. ఇప్పుడు ఖైదీ ప్ర‌భావం మెల్లమెల్ల‌గా త‌గ్గిపోయింది. అక్క‌డి థియేట‌ర్లూ ఖాళీ అవుతున్నాయి. అందుకే దుబాయ్ తెలుగు అసోసియేష్ ‘గౌతమి పుత్ర‌ని ప్ర‌పంచ‌మంతా చూస్తోంది. ఒక్క దుబాయ్‌లో త‌ప్ప‌. ఇక్క‌డ కూడా గౌతమి పుత్ర విడుద‌ల చేయండి ప్లీజ్‌’ అంటూ గౌత‌మిపుత్ర ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని అభ్య‌ర్థిస్తున్నారు. వ‌చ్చే వారంలో ఈ చిత్రాన్ని దుబాయ్‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సన్నాహాలు చేస్తోంది. కాక‌పోతే దుబాయ్‌లో పైర‌సీ ప్ర‌భావం ఎక్కువ‌. ఈ ఎఫెక్ట్ గౌత‌మిపుత్ర‌పై ప‌డే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. అదే ఖైదీతో పాటు గౌత‌మి కూడా విడుద‌లైతే.. ఖైదీ వ‌సూళ్ల‌పై గౌత‌మి క‌చ్చితంగా ప్ర‌భావం చూపించేద‌ని డిస్టిబ్యూట‌ర్లు లెక్క‌లు వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios