టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథని తమిళ్ లో మళ్ళీ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య వర్మ గా రూపొందుతున్న ఈ బోల్డ్ కంటెంట్ పై చిత్ర యూనిట్ ఇప్పుడిపుడే అంచనాలు పెరిగేలా అడుగులు వేస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ముందుగా నటి నటుల ఎంపికలో దర్శకుడు ఎవరు ఊహించని విధంగా ఆలోచిస్తున్నారు. 

అర్జున్ రెడ్డి రీమేక్ కు బాల తప్పుకోగా ఒరిజినల్ కథకు సహాయ దర్శకుడిగా పని చేసిన గిరీశయ్య కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు జనాలను ఆకర్షిస్తోంది. సీనియర్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ హీరో తండ్రిగా కనిపించబోతున్నాడు. 

నటుడిగా అప్పుడపుడు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్ మొదటి సారి ఒక కీ రోల్ లో నటించడానికి సిద్దమయ్యాడు. తెలుగులో విజయ్ ఫాదర్ పాత్రలో మహేష్ బావ సంజయ్ స్వరూప్ నటించారు. ఇప్పుడు తమిళ్ లో గౌతమ్ మీనన్ ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. మరి ఆయన ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.