‘రామబాణం’ డైరెక్టర్ శ్రీవాస్ - గోపిచంద్ మధ్య గొడవలు.. రీజన్ బయటపెట్టిన మ్యాచో స్టార్..
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ - దర్శకుడు శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ తో ఉన్న గోడవలపై స్పందించారు.
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ (Gopichand) చివరిగా ‘పక్కా కమర్షియల్’తో అలరించారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీవాస్ (Sriwass) - గోపీచంద్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘రామబాణం’. చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. డింపుల్ హయతి (Dimple Hayathi) హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ట నిర్మాతలుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని గ్రాండ్ గా నిర్మించింది.
ఇప్పటికే చిత్ర ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచారు. శ్రేయాస్ మీడియా ప్రమోసన్స్ ను నిర్వహిస్తుండగా తాజాగా డైరెక్టర్ తేజ - గోపీచంద్ తో ఓ ఇంటర్వ్యూను సెట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొద్ది సేపటి కింద విడుదల చేశారు. ఈ సందర్భంగా తేజ అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ ఆసక్తికరంగా స్పందించారు.
ముఖ్యంగా RamaBanam షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీవాస్ తో గోపీచంద్ కు గోడవలు జరిగినట్టు ప్రచారం జరిగిందంటూ తేజ ప్రశ్నించారు. ఇందుకు గోపీచంద్ స్పందించారు. సినిమా లెన్తీ అవుతుందనే విషయంలోనే గోపీచంద్ - శ్రీవాస్ కు గోడవ జరిగినట్టు తెలిపారు. రిజల్స్ వెంటనే తెలిసిపోతుండటంతో ఘర్షణలు జరిగేవి ప్రోమో ద్వారా తెలుస్తోంది. అలాగే తేజ - గోపీచంద్ సినిమా విషయంపైనా ప్రశ్నించారు. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను తేజ సంధించారు. వాటికి గోపీచంద్ కూడా బుదలిచ్చారు. అయితే రేపు ఫుల్ ఇంటర్వ్యూ రానుంది. తద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
డైరెక్టర్ శ్రీవాస్ - గోపీచంద్ కాంబోలో ఇది మూడో చిత్రం. గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యంతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈసినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. మే 5న చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.