ఈ వారం రిలీజైన రెండు సినిమాలు కూడా హిట్ కాంబినేషన్ నమ్మి వచ్చాయి. అయితే ఆ నమ్మకాన్ని బ్రేక్ చేశాయనే చెప్పాలి. రామబాణం, ఉగ్రం.. ఈ రెండిటిలో దేనికి హిట్ టాక్ రాలేదు.
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో చెప్పుకోదగినవి “ఉగ్రం” , “రామబాణం”. ఉగ్రం చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించగా తనకు నాంది వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా తన హిట్ దర్శకుడు శ్రీవాస్ తో చేసిన సినిమా “రామబాణం”. ఈ రెండు సినిమాలు జస్ట్ ఓకే టాక్ ని తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో అభిమానులు థియేటర్స్ కు వెళ్లి చూస్తూండగా ...ఓటిటి స్ట్రీమింగ్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘రామబాణం‘ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో, త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేని ఈ సినిమా, కనీసం ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలంటోంది ట్రేడ్.
‘రామబాణం’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రంలో కుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ మరియు తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. భూపతి రాజా ఈ సినిమా కథ రాశారు.
అలాగే ఉగ్రం సినిమాని అని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని ఓ నెల తర్వాత ఈ వేసవి శెలవుల్లోనే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాసం ఉందంటున్నారు. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ‘నాంది’ సినిమాకు పనిచేసిన టీమ్‌లో చాలా మంది ‘ఉగ్రం’ సినిమాకు పనిచేశారు. ‘నాంది’లో చేయని తప్పుకు శిక్ష అనుభవించే అమాయకుడిగా నరేష్‌ను చూపించిన విజయ్ కనకమేడల.. ‘ఉగ్రం’లో మాత్రం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఆవిష్కరించారు. నరేష్ మునుపెన్నడూ చేయని యాక్షన్ సీక్వెన్స్‌లను ఈ సినిమాలో చేయించారు. అయితే ‘నాంది’ మ్యాజిక్‌ను ‘ఉగ్రం’ సినిమాతో నరేష్, విజయ్ రిపీట్ చేయలేకపోయారు.
