టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్‌ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). లక్ష్యం, లౌక్యం తర్వాత శ్రీవాసు మరోసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామబాణంలో డింపుల్‌ హయతి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.


సినిమాకు ప్రమోషన్స్ ఖచ్చితంగా కావాలి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎంత ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టినా ఆనటం లేదు. దాంతో కొత్త మార్గాల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన భాధ్యత కూడా దర్శక,నిర్మాతలపై పడింది. ఈ క్రమంలో రకరకాల ఆలోచనలు, ప్లాన్స్ చేస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం టీమ్ సైతం ఇలాంటి ఓ కొత్త తరహా ప్రమోషన్స్ తో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. 

గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రామబాణం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో జగపతి బాబు, కుష్బూ నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రామబాణం మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ తరవాత అంచనాలు మరింతగా పెంచేసింది.

వేసవి కానుకగా మే 5న విడుదల కానున్న ఈ మూవీ యొక్క ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తోంది యూనిట్. ఓవైపు పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో పాటు ఇతర టివి ఛానల్స్ లో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రామబాణం యూనిట్ సందడి చేస్తూ తమ సినిమాని మరింతగా ప్రమోట్ చేస్తోంది. అలాగే పాల పాకెట్లు మీద తమ సినిమా పోస్టర్ ని వేయటం ద్వారా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని నిర్వహిస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

నిల్వ ఉంచిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తరచుగా ప్యాక్ చేసిన ప్యాకెట్లలో వచ్చే ఫాస్ట్ ఫుడ్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. టెర్రకోట, సాంప్రదాయ గ్రైండర్లతో గ్రైండింగ్ లాంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు. నేటి కాలంలో ప్రజలు ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే రామబాణం ప్రధాన నినాదం అని టీమ్ చెప్తోంది.