యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ అప్పుడపుడు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో కూడా అలరిస్తూ వస్తున్నాడు. పెద్దగా నెగిటివ్ ఫ్యాన్స్ లేని ఈ హిరోతో మంచి యాక్షన్ కథను తెరకెక్కిస్తే సాలిడ్ గా ఉంటుందని చాలా మంది దర్శకులు చెప్పారు. అయితే గోపికి ప్రస్తుతం ఎలాంటి హిట్స్ లేవు. 

లౌక్యం వరకు బాగానే హిట్స్ అందుకున్న గోపీచంద్ ఆ తరువాత వరుస డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నాడు. చివరగా వచ్చిన పంతం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే నెక్స్ట్ గోపీచంద్ తనకు మంచి విజయాల్ని అందించిన ఫెవరెట్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్నాడు. లక్ష్యం - లౌక్యం సినిమాలతో గోపికి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ చివరగా సాక్ష్యం సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. 

ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఇక ఇప్పుడు గోపీచంద్ తో మూడవసారి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహాలో ఒక సినిమాను చేయాలనీ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.ఇక  త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తెచ్చి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చెయ్యాలని అందుకున్నారు. మరి గోపీచంద్ ఈ దర్శకుడితో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.