పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభోట్ల కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 3న ప్రారంభమైంది. 10 రోజులు జరిగిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.


కెరీర్ లో సరైన హిట్ లేనప్పుడు హీరోలు, డైరక్టర్స్ తమ పాత సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ చేయటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ కాంబినేషన్ తో బిజినెస్ అయ్యిపోతుంది. క్రేజ్ ఏర్పడుతుంది. అలాగే మాచో స్టార్‌ గోపీచంద్‌ కెరీర్ లో కొంతకాలంగా సరైన హిట్ లేదు. ఈ నేపధ్యంలో తనకు కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన శ్రీవాసుతో మరో సినిమా చేయటానికి రెడీ అయ్యారు. అలాగే ఆ చిత్రానికి ‘లక్ష్యం–2’ అని టైటిల్ ఫిక్స్ చేసారని సమచారం. వివరాల్లోకి వెళితే...

గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్ చిత్రం ‘లక్ష్యం’. దర్శకుడు శ్రీవాస్‌ తొలి చిత్రంగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లోసెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌ లో ‘లౌక్యం’ వచ్చి హిట్టైంది. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టేందుకు వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభోట్ల కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 3న ప్రారంభమైంది. 10 రోజులు జరిగిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కొంత విరామం తర్వాత తాజా షెడ్యూల్‌ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు చక్కని సందేశం మిళితమైన బలమైన కథతో దర్శకుడు శ్రీవాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ చిత్రానికి ‘లక్ష్యం–2’ టైటిల్‌ పరిశీలనలో ఉందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. మరి టైటిల్‌ ఏంటనేది నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డింపుల్‌ హయాతీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, కుష్భూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా: వెట్రి పళనిస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్‌, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌.

ఇక గోపిచంద్... ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మే 20, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారనితెలుస్తోంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో ఊపు మీదున్న జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్, బ‌న్నీవాసు కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.