యాక్షన్ హీరో గోపీచంద్ హిట్టందుకొని ఏళ్ళు గడుస్తోంది. చివరగా 2014 లౌక్యం సినిమా తరువాత చేసిన సినిమాలన్నీ నీరాశపరిచాయి. జిల్ పరవాలేధనిపించినప్పటికీ గోపి స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోలేదు. చివరికి ఆరడుగుల బులెట్ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కు నోచుకోలేని పరిస్థితి అంటే గోపి డేంజర్ జోన్ లోనే ఉన్నాడని చెప్పవచ్చు. 

అయితే ఈ యక్షన్ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే సాహసం మూవీనే. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి 'కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా పాకిస్థాన్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక నిధి అన్వేషణలో సాగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో గోపీచంద్ కొత్త సినిమాలో కూడా దాయాధి దేశం టచ్ ఉంటుందని టాక్. నేడు ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో షూటింగ్ ప్రారంభమయ్యింది. 

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సాహసం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టందుకోవడంతో ఇప్పుడు మరోసారి పాకిస్థాన్ లో తన యాక్షన్ ను చూపించడానికి రెడీ అవుతున్నాడు. 

పాక్ ముఠాలను మట్టుబెట్టే హీరోగా గోపి అదరగొట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గాని సినిమాను గోపి మార్కెట్ కు మించిన బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించనున్నాడు.