Asianet News TeluguAsianet News Telugu

రవితేజతో జాగ్రత్త.. ఆ డైరెక్టర్ ను హెచ్చరించిన రాజమౌళి, ఇంతకీ ఏమన్నారంటే..?

రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. రవితేజ గురించి రాజమౌళి తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.  

Gopichand malineni Share Rajamouli Revil Secret about Raviteja JMS
Author
First Published Apr 2, 2023, 10:43 AM IST

వరుస సినిమాలను సెట్స్ పైకి ఎక్కిస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అంతే ఫాస్ట్ గాసినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు కూడా. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'రావణాసుర. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా  ఈ నెల 7న  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈసందర్భంగా.. ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదు - శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  అతిధిగా హాజరయ్యారు దర్శకుడు గోపీచంద్ మలినేని. 

గోపీచంద్ మలినేని రవితేజ తో మూడు సినిమాలు తెరకెక్కించారు.  ఈమూడు సినిమాలు గోపీచంద్ ను దర్శకుడిగా నిలబెట్టాయి. ఇక ఈసందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ... ఈ రోజున నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణం రవితేజనే. ఏ కేరక్టర్ ఇచ్చినా ఆయన ఇరగదీసేస్తాడు అని చెప్పాడు. ఆయనతో పనిచేయడం అంటే ఎనర్జీ డ్రింక్ తాగినట్టే అన్నారు గోపీచంద్.   

రవితేజతో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. నన్ను చూసిన వాళ్లంతా నేను రవితేజ బ్రదర్ ని అనుకుంటారు. ఆకారంలో ఆయనలా ఉండటం నా లక్కు.. నిజంగానే నేను ఆయనకి తమ్ముడులాంటి వాడిని. రవితేజ హీరోగానే దర్శకుడిగా నా కెరియర్ మొదలైంది. ఆయనతో నేను చేసిన ఫస్టు సినిమా డాన్ శీను'.. ఆ సినిమాకి గెస్టుగా రాజమౌళిని ఆహ్వానించడానికి వెళ్లాను.. అప్పుడు అక్కడ రాజమౌళి కొన్ని విషయాలు రవితేజ గారి గురించి చప్పారు. ఒక రకంగా హెచ్చరించారు అని అన్నారు.  

రాజమౌళి గారిని కలిసి ఇలా అని  విషయం చెప్పాను.అప్పుడు రాజమౌళి కొన్ని విషయాలు చెప్పారు..  రవితేజ నుంచి ఒక వేరియేషన్ ను అడిగితే నాలుగు వేరియేషన్లు చేసి చూపిస్తాడు. ఆ ఏనర్జీని మనం అందుకోవడానికి చాలా కష్టపడాలి.. ఇక ఆయన విషయంలో నీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు .. దూసుకెళ్లిపో" అని రాజమౌళి అన్నారు.  అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు గోపీచంద్ మలినేని. 

అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాలు.. ఆతరువాత రవితేజతో సినిమా చేసినప్పుడు తనకు అనుభవంలోకి వచ్చాయన్నారు గోపీచంద్. ఇక రావణాసుర సినిమాలో రవితేజతో పాటు ఐదుగురు హీరోయిన్లు నటించారు. ఆయనతో చేసిన ఆ  ఐదుగురు హీరోయిన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు గోపీచంద్ మలినేని. ఈ సినిమాలో రవితేజ  కాస్త నెగెటీవ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈసినిమాకు రావణాసుర టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. 

ఇక ఈమూవీలో రవితేజ కోసం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, పూజిత పోన్నాడతో పాటు దక్ష  ఈ మూవీలో సందడి చేయబోతున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో  తెర‌కెక్కిస్తున్న ఈసినిమాలో రవితేజ తో పాటుగా అక్కినేని హీరో.. సుశాంత్‌  కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios