ఈ సంక్రాంతికి మాస్ మహారాజు రవితేజ సూపర్ హిట్ కొట్టేశాడు. బాక్సాఫీసును షేక్ చేస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాడు. ఈ చిత్రం బరిలో ఉన్న సంక్రాంతి పందెం కోళ్లకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హిట్ల విషయంలో వెనకబడ్డ రవితేజకు ఇది ఊపొచ్చే విషయమే. ఆయన ఇప్పుడు తన రెమ్యునేషన్ పెంచుకునే పనిలో పడితే..డైరక్టర్ గోపిచంద్ మలినేనికు గతంలో ఎన్నడూ లేనన్ని ఫోన్ కాల్స్ తో బిజీగా ఉన్నారట. ఇండస్ట్రీ మొత్తం పోన్స్ చేసి కంగ్రాట్స్ చెప్తోందిట.

 గతంలో ఆయన కథ వినటానికి అపాయింట్మెంట్ ఇవ్వటానికి ఇష్టపడని హీరోలు, నిర్మాతలు సైతం ఫోన్ నెంబర్ తీసుకుని మరీ శుభాకాంక్షలు చెప్పి, మంచి కథ తెచ్చుకో..చేసేద్దాం అని హామీ ఇస్తున్నారట. అయితే గోపిచంద్ మలినేని మాత్రం మైత్రీ మూవీస్ తో సినిమా చేయటానికి కమిటయ్యాడని సమాచారం. ఇంతకీ హీరో ఎవరూ అంటే ఇంకెవరూ బాలయ్యే అంటున్నారు. 

  గోపీచంద్ కి సాలిడ్ కథ దొరికితే మాస్ హీరోలను బాగా ఎలివేట్ చేసే సత్తా ఉంది అని ఈ సినిమా ప్రూవ్ చేసింది.  మరో ప్రక్క బాలయ్య అంటేనే పక్కా మాస్ కదా. అందుకే, వీరిద్దరి కాంబినేషన్ ని సెట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేస్తోందని వినికిడి.

అయితే  ‘క్రాక్’ తర్వాత యంగ్ హీరోలు, మార్కెట్ ఉన్న పెద్ద హీరోలతో చేసేందుకు మలినేని ఆసక్తి చూపుతున్నాడు అంటున్నారు. డాన్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి సినిమాలు తీశాడు మలినేని. ఇప్పటివరకు రవితేజతో చేసిన సినిమాలే వర్క్ అవుట్ అయ్యాయి. సాయి ధరమ్ తేజతో తీసిన విన్నర్, రామ్ తో చేసిన పండగ చేస్కో పెద్దగా వర్కవుట్ కాలేదు.