గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సైరా సినిమాతో పోటీ పడేందుకు చాణక్య సినిమాతో సిద్దమైన గోపీచంద్ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. రీసెంట్ గా బివిఎస్ ప్రసాద్ నిర్మాతగా ఓ కొత్త ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన గోపి ఇప్పుడు మరో కొత్త సినిమాను అదే తరహాలో స్టార్ట్ చేశాడు.

సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, తమన్నా - గోపీచంద్ ఫ్రెమ్ లో ఉండగా మొదటి షాట్ కి క్లాప్ కొట్టారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.  

ఇక గోపీచంద్ సరసన మొదటిసారి తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇదివరకే ఈ బేబి దర్శకుడితో రచ్చ - బెంగాల్ టైగర్ సినిమాల్లో నటించింది. ఇక గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో గౌతమ్ నంద చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. మరి ఈసారైనా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. ఇక గోపీచంద్ చాణక్య సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.