గత నాలుగేళ్లుగా హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం అందుకోవడం లేదు, వరుస అపజయాలతో ఉన్న గోపి నెక్స్ట్ ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని కథలను ఎంచుకుంటున్నాడు. అయితే సీనియర్ దర్శకులతో కాకుండా మునుపటి లాగా కొత్తగా వచ్చే దర్శకులతోనే గోపి సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. 

ఇటీవల తిరు సుబ్రహ్మణ్యం అనే యువ దర్శకుడు చెప్పిన హై వోల్టెజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు గోపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చివరగా పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ హీరో మొదట పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్స్ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి పెద్దగా ప్రయోగాలు చేయకుండా తన నుంచి అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో అలాంటి కథతో రావడానికి గోపీచంద్ సిద్దమయ్యాడట.  

ఇక ఇప్పుడు అనిల్ సుంకర ప్రొడక్షన్ లో తిరు దర్శకత్వంలో కథను సెట్స్ పైకి తేనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అలాగే తమిళ రీమేక్ 96లో కూడా గోపీచంద్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.