Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ఏలో ‘యశోద’కు మంచి రెస్పాన్స్.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన సై-ఫై చిత్రం ‘యశోద’ ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ యూఎస్ఏలోనూ తొలిరోజు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

Good response to Samanthas Yashoda in USA, How much collected on the first day?
Author
First Published Nov 11, 2022, 6:21 PM IST

చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్ నటించిన చిత్రం ‘యశోద’. ఈరోజు ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. డివోర్స్ తర్వాత సమంత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ‘యశోద’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే యూఎస్ఏలోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘యశోద’ తొలిరోజు అభిమానులు, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు.. కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాలిడ్ మార్క్ నే ‘యశోద’ రీచ్  కాబోతుందని అంటున్నారు. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అందినట్టు తెలుస్తోంది.  తాజా సమాచారం ప్రకారం.. యూఎస్ఏ  బాక్సాఫీస్ వద్ద ‘యశోద’కు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఫస్ట్ డే  యూఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా 60 వేలకు పైగా డాలర్లను సాధించినట్టు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కు తొలిరోజు ఇంత మంచి రెస్పాన్స్ రావడం గూడ్ మూమెంట్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్  కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఇండియాలోనూ యశోద చిత్రం సాలిడ్ కలెక్షన్లను రాబట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios