పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమాకి సంబంధించిన ఓ సర్ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు నిర్మాత ఏఎం రత్నం. సినిమా షూటింగ్‌, రిలీజ్‌కి సంబంధించిన ఆయన క్లారిటీ ఇచ్చాడు.  

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్రానికి సంబంధించి ఇటీవల పవన్‌ పుట్టిన రోజు సందర్బంగా కొత్త లుక్‌ని విడుదల చేసింది యూనిట్. దీంతో సినిమా ఇంకా ట్రాక్‌లోనే ఉందనే ఫ్యాన్స్ ఆశలకు నీరుపోసినట్టయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు నిర్మాత ఏఎం రత్నం. సినిమా షూటింగ్‌, రిలీజ్‌కి సంబంధించిన ఆయన క్లారిటీ ఇచ్చాడు. అదిరిపోయే గుడ్ న్యూస్‌ చెప్పాడు. 

తాజాగా ఆయన `రూల్స్ రంజాన్` చిత్ర రిలీజ్‌ డేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. `హరిహర వీరమల్లు` సినిమా అప్‌డేట్‌పై ప్రశ్న ఎదురు కాగా, ఆయన ఎట్టకేలకు పెదవి విప్పారు. ఈ సినిమా భారీ పాన్‌ ఇండియామూవీ అని, పవన్‌ కెరీర్‌లోనే తొలి పాన్‌ ఇండియా చిత్రమన్నారు. ఇది పీరియడ్‌ ఫిల్మ్ అని, చాలా సెట్స్, కాస్ట్యూమ్స్ తో కూడుకుని ఉంటుంది. అయితే పవన్‌ బిజీ షెడ్యూల్‌ గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బుని రాజకీయాలకు వాడుకుంటున్నారు. కాబట్టి `హరిహర వీరమల్లు` సినిమా చేసి తీరుతాడు అని తెలిపారు నిర్మాత ఏ ఎం రత్నం. 

ఈ సందర్భంగా షూటింగ్‌, రిలీజ్‌ డేట్‌ విషయాలను కూడా ఆయన వెల్లడించారు. పవన్‌ పాలిటిక్స్ బిజీ నేపథ్యంలో త్వరగా పూర్తయ్యే సినిమాలు చేస్తున్నారు, అందుకే రీమేక్‌లు చేస్తున్నారని తెలిపారు. అదే సమయంలో తమ సినిమా షూటింగ్‌ కూడా జరుపబోతున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు `హరిహర వీరమల్లు` షూటింగ్‌ని పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది ఏపీ ఎలక్షన్లకి ముందే తమ సినిమాని రిలీజ్‌ చేస్తామని, ఆ విషయంలో డౌట్‌ ఏం లేదన్నారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడమే కాదు, రెట్టింపు ఉత్తేజాన్నిచ్చారు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఫారెన్‌లో ఈ చిత్రషూటింగ్‌ జరుగుతుంది. రేపట్నుంచి ఆయన హరీష్‌ శంకర్‌ `ఉస్తాద్‌ భగత్ సింగ్‌` చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. అనంతరం `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందట. మరి నిర్మాత కాన్ఫిడెంట్ చూస్తుంటే పవన్‌ ఈ సినిమా పూర్తి చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

YouTube video player

ఇదిలా ఉంటే ఈ సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌కి, పవన్‌కి పడటం లేదని, స్క్రిప్ట్ పరంగా బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే సినిమా డిలే అవుతుందన్నారు. మరోవైపు సెట్‌ వర్క్ కారణంగా డిలే అవుతుందని రకరకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత వ్యాఖ్యలు ఆయా రూమర్లకి చెక్‌ పెట్టినట్టయ్యింది. ఇక `హరిహర వీరమల్లు` చిత్రంలో బాబీ డీయోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది.