టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి ఒకేసారి రెండు అనుకూలించే విషయాలు వచ్చాయి. ఒక సంతోషాన్ని చూసే లోపే మరో బంపర్ అఫర్ లాంటి నిర్ణయం చిన్న నిర్మాతలకు వరంలా మారింది. సినిమా, సీరియ‌ల్స్‌, డిజిట‌ల్ మాధ్య‌మాల్లో కొన్ని నిర్ణయాలను మారుస్తూ టారిఫ్ రేట్ కార్డ్ పై ఒక నిర్ణయానికి వచ్చారు. 

సాధారణంగా షూటింగ్ కోసం వన్య ప్రాణులను వాడుకోవడం కుదరదు. కానీ ఇక నుంచి కొన్ని షరతుల మేరకు వాటిని షూటింగ్ లో ఉపయోగించుకోవచ్చని ఆర్డర్ వచ్చింది. వ‌న్య ప్రాణి సంర‌క్ష‌ణ విభాగం ఆన్‌లైన్‌లో నిర్మాతలు అప్లై చేసుకొని షూటింగ్ చేయవచ్చు. 

ఇక 350 ప్రదర్శనలు పూర్తయితే  కానీ మినీ బడ్జెట్ సినిమాలకు డిజిట‌ల్ టారిఫ్ రేట్ కార్డ్ అదుపులోకి రావడం లేదు. ఈ విషయంపై  డిజిటల్ ప్రొవైడర్స్‌, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చారు.  ఎన్ని షోలు అయినా లిమిట్ లో లేకుండా.. సినిమా విడుదలైన డే నుంచి రేట్ కార్డ్‌ను అమ‌లు చేస్తారు.  క్యూబ్‌, యు.ఎఫ్‌.ఒ త‌ర‌హాలో స్క్రాబెల్ సైతం షో ట్రాన్స్‌ఫ‌ర్‌కి ఎలాంటి చార్జీలు తీసుకోబడదని రూల్ పాస్ చేశారు. ఇదివరకు ట్రాన్స్‌ఫ‌ర్ చార్జీలుగా 35,500 రూపాయలను వసూలు చేసేవారు.