పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన మరో భారీ బడ్జెట్ మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న వరల్డ్ వైడ్ గా రికార్డు థియేటర్స్ లో రాధే శ్యామ్ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రాధే శ్యామ్ యూనిట్... ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చారు.

రాధే శ్యామ్ ట్రైలర్(Radhe Shyam Trailer) కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ టైం అండ్ డేట్ తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. దాదాపు మూడేళ్లుగా రాధే శ్యామ్ షూటింగ్ జరుపుకుంటుంది. అనుకోని కారణాలతో షూటింగ్ సవ్యంగా సాగలేదు. 2022 సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ విడుదల కావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో విడుదల వాయిదా పడింది. 

ఫైనల్ గా మార్చి 11న రాధే శ్యామ్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఏది ఏమైనా ఈసారి చెప్పిన ప్రకారం రాధే శ్యామ్ థియేటర్స్ లో దిగడం ఖాయమే. విడుదలకు సమయం దగ్గర పడిన కారణంగా ప్రొమోషన్స్ పై దృష్టి పెట్టారు . దీనిలో భాగంగా ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని మార్చి 2న సాయంత్రం 3 గంటలకు రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 

Scroll to load tweet…

పీరియాడిక్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు రాధాకృష్ణ రాధే శ్యామ్ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాధే శ్యామ్ తెరకెక్కింది. పూజా హెగ్డే (Pooja hegde)ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు. రాధే శ్యామ్ చిత్రంపై పరిశ్రమలో భారీ హైప్ నెలకొని ఉంది.