పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిందీలో విడుదల కానుంది. సుదీర్ఘ కాలం నడిచిన కోర్ట్ కేసులో జాన్ అబ్రహం పై సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గెలిచినట్లు సమాచారం అందుతుంది.

భీమ్లా నాయక్ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. భీమ్లా నాయక్ మూవీతో పవన్ నార్త్ ఇండియా స్టామినా ఏమిటో తెలియజేయాలని అనుకున్నారు. ఫ్యాన్స్ సైతం హిందీ వర్షన్ విడుదల చేయాలని పట్టుబట్టారు. అనూహ్యంగా భీమ్లా నాయక్ హిందీ విడుదల ఆగిపోయింది. కొన్ని లీగల్ సమస్యలలో హిందీ డబ్ వర్షన్ చిక్కుకుంది. భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. 

అయ్యప్పనుమ్ కోశియుమ్ హిందీ రీమేక్ హక్కులు హీరో జాన్ అబ్రహం దగ్గర ఉన్నాయి. హిందీ రైట్స్ తన వద్ద ఉన్న కారణం భీమ్లా నాయక్ హిందీ డబ్బింగ్ వర్షన్ విడుదల చేయడానికి వీలు లేదని కేసు ఫైల్ చేశారు. దీనిపై నాగ వంశీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఫైనల్ గా నాగ వంశీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో భీమ్లా నాయక్ హిందీ వర్షన్ త్వరలో నార్త్ ఇండియాలో విడుదల చేసే సూచనలు కలవు. 

సౌత్ చిత్రాలకు అక్కడ ఆదరణ దక్కుతుండగా భీమ్లా నాయక్ విడుదల ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి చెందిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2 బాలీవుడ్ సాధించాయి. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భీమ్లా నాయక్ హిందీలో కూడా విడుదల చేయాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. అక్కడ బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టి పవన్ చరిత్ర సృష్టిస్తారని ఆయన జోస్యం చెప్పాడు. భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.