సీనియర్‌ నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌ లు కలిసి ఇటీవల `మళ్ళీ పెళ్ళి` చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. తాజాగా ఓటీటీలో రాబోతుంది. రిలేజ్‌ డేట్‌ ఫైనల్‌ అయ్యింది.

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో మోస్ట్ హాట్‌ కపుల్‌గా మారారు పవిత్ర లోకేష్‌, నరేష్‌. ఈ ఇద్దరు కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవల తమ రిలేషన్‌షిప్‌పై `మళ్ళీ పెళ్ళి` అనే సినిమాని తీసుకున్నారు. నరేష్‌ తన బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎంఎస్‌ రాజు దీనికి దర్శకత్వం వహించారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా దారుణంగా పరాజయం చెందింది. అనేక విమర్శలకు కేరాఫ్‌గా నిలిచింది. ఇరవై ముప్పై కోట్లు పెట్టి చేసిన ఈ చిత్రానికి కనీసం కోటీ రూపాయల గ్రాస్‌ కూడా రాలేదు. అంతటి దారుణ పరాజయం చెందడం గమనార్హం. 

ఈ సినిమాకి ముందు నరేష్‌, పవిత్రలు హడావుడి చేశారు. ఆ సమయంలో వరుస ఇంటర్వ్యూలతో సందడి చేశారు. తమ ప్రేమ విషయాలను వెల్లడించారు. అనేక రహస్యాలను బయటపెట్టారు. అదే సమయంలో సినిమాలోనూ సీక్రెట్లు వెల్లడించారు. తమ గుట్టు తామే బయటపెట్టుకున్నట్టు, తమ రిలేషన్‌షిప్‌ వ్యవహారాలన్నీ నరేష్‌ ఈ సినిమాలో బహిర్గతం చేసుకున్నారు. అదే సమయంలో తాను పవిత్రకి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందో, అదే సమయంలో నరేష్‌కి పవిత్ర ఎందుకు దగ్గరైందో అనే విషయాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నం బాగున్నా, సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉందనే విమర్శలున్నాయి, అదే సమయంలో సొంత పరువు బజారున వేసుకున్నారనే కామెంట్లు వచ్చాయి. 

సినిమా రిలీజ్‌ టైమ్‌లో హడావుడి చేసిన ఈ జంట ఇప్పుడు సైలెంట్‌ అయ్యింది. తమ పనుల్లో(సినిమా షూటింగ్ ల్లో) బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే తమ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది `మళ్ళీ పెళ్ళి` సినిమా. ఇది త్వరలో ఓటీటీలో రాబోతుంది. అమెజాన్‌ప్రైమ్‌ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం ఈ నెల 23న ఓటీటీలో రాబోతుంది. సడెన్‌గా ప్రకటించడంతో పవిత్ర లోకేష్‌, నరేష్‌ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు. థియేటర్లలో మెప్పించలేని ఈ చిత్రానికి ఓటీటీ ఆదరణ దక్కుతుందేమో చూడాలి. 

నరేష్‌ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురితోనూ పడలేదు. దీంతో విడిపోయారు. మూడో భార్య రమ్య రఘుపతి.. నరేష్‌ నుంచి భరణం కోరుతుంది. అయితే వీరి విడాకుల కేసు కోర్ట్ లో ఉంది. అందుకే పవిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నారు నరేష్‌. మరోవైపు పవిత్ర లోకేష్‌ సైతం తనభర్త నుంచి విడిపోయింది. తనని సరిగా చూసుకోకపోవడం, తక్కువగా చూడటం వంటి కారణాలతో, సంసార జీవితంలో సంతోషం లేని కారణంగా భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కూడా కోర్ట్ లో ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరు హైదరాబాద్‌లోని నరేష్‌ నివాసంలో కలిసి ఉంటున్నారు.