అర్జున్ రెడ్డి హుషారు సినిమాలు పక్కా మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ సాధించాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బోల్డ్ సినిమాలు.. బూతు డైలాగులతో టీజర్స్ ని వదిలితే జనాల్లో అంచనాలు గట్టిగానే పెరుగుతాయి కానీ మధ్యలో సెన్సార్ కట్ అనేది ఒకటి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. 

ముందు టీజర్ తో రచ్చ చేశామా లేదా? అనేదే ముఖ్యమయ్యింది. చిన్న సినిమాలకు అదే కీ పాయింట్. ఇప్పుడు ఫలక్ నుమా దాస్ టీజర్ కూడా అదే తరహాలో షాక్ ఇస్తోంది. కానీ చిత్రానికి దర్శకత్వం వహించి హీరోగా చేసిన విశ్వక్ సేన్ మాత్రం ఇది చిన్న సినిమా కాదు.. పక్కా పెద్ద సినిమా అని అంటున్నాడు. విజువల్స్ చూస్తే అతను చెప్పింది నిజమే అనిపిస్తోంది.  

ఖర్చు గట్టిగానే అయ్యిందని తెలుస్తోంది. అయితే మాటలు పచ్చిగా వాడెయ్యడం సెన్సార్ ఒప్పుకోకపోయినా ఆడియెన్స్ మాత్రం దానిపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదు. ఎందుకంటే రియాలిటీకి తగ్గట్టుగా పాత బస్తి హైదరాబద్ వంటి ఏరియాల్లో కుర్రకారు ఉండే తీరును కరెక్ట్ గా ప్రజెంట్ చేశారనిపిస్తోంది. 

మలయాళం అంగామలే డైరీస్ అనే సినిమాకు ఇది రీమేక్ అయినప్పటికీ విశ్వక్ సేన్ తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించాడని అనిపిస్తోంది. సినిమాపై అయితే ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. అది మరచిపోకముందే సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే మరో హుషారు - అర్జున్ రెడ్డి లెవెల్లో సినిమాకు మంచి ఆధారణ దక్కుతుందని చెప్పవచ్చు..