`గాడ్ ఫాద‌ర్‌`గా మ‌న‌ముందుకొచ్చారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన `లూసిఫ‌ర్‌`కి ఇది రీమేక్‌. అక్క‌డ మోహ‌న్ లాల్ చేసిన పాత్ర‌ను ఇక్క‌డ చిరు పోషించారు. మ‌రి మోహ‌న్ లాల్‌లా.. చిరు కూడా మ్యాజిక్ చేయ‌గ‌లిగారా?  అంటే అంతకు మించే అంటున్నారు అభిమానులు. 


 మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల అయింది. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, మురళి శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా మంచి నుంబర్లు రికార్డ్ చేస్తోంది. అయితే ఈ రోజు నుంచి అసలు లిట్మస్ టెస్ట్ ప్రారంభం కానుంది. 

ఈ సోమవారం రోజు కలెక్షన్స్ బాగుండి ,హౌస్ ఫుల్స్ అయితే ...సినిమా సూపర్ హిట్ అయ్యనట్లే అంటున్నారు. అయితే చాలా చోట్ల మార్నింగ్ షోలు ఖాళీగా ఉన్నాయని ట్రేడ్ అంటోంది. ఇదే పరిస్దితి సాయింత్రానికి కంటిన్యూ అయితే మేజర్ డ్రాప్ క్రింద లెక్క వేస్తారు. ఈ నాలుగు రోజులు ఈ సినిమాని ఫ్యాన్స్ కు బాగా అదరించారు. ఇప్పుడు సామాన్య ప్రేక్షకులు,ఫ్యామిలీలు కదిలి వస్తేనే నెక్ట్స్ లెవిల్ ఉంటుందనేది నిజం. 

మరో ప్రక్క చిరు ఒక వీడియో ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. "హలో ఫ్రెండ్స్. నమస్తే. గాడ్‌ఫాదర్‌ పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మా ధన్యవాదాలు. కేవలం రెండు రోజులలోనే సినిమా 69 కోట్ల రూపాయల ఆదాయాన్ని అధిగమించిందని అన్నారు. నిజంగా దీన్ని మీరు పాన్-ఇండియన్ సినిమాగా చేసారు. సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు మరియు నా అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు," అని అన్నారు చిరు. 

అయితే వీడియో లో చిరు ఈ చిత్రం 2 రోజుల్లో 69 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అన్నారు కానీ వాస్తవానికి సినిమా రెండు రోజుల గ్రాస్ దాదాపు 45 కోట్లు. దాదాపు 25కోట్ల మేర హైప్ చేసి ప్రచారం చేయడం ఆశ్చర్యకరం. అది కూడా చిరు స్వయంగా ఈ నంబర్స్ ని ప్రకటించడంతో జనాలు షాక్ అవుతున్నారు. కొందరేమో చిరంజీవి కి అసలు కలెక్షన్లు తెలియదని, తన పీఆర్వోలు చెప్పిన మాటలే చెప్పారని అన్నారు. రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా చిరు జోష్ కనపడింది..