Asianet News TeluguAsianet News Telugu

ప్రదీప్ తో పెళ్లిపై జ్ఞానేశ్వరి కామెంట్స్!

ప్రముఖ యాంకర్ ప్రదీప్ కోసం స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' షోని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షోలో జ్ఞానేశ్వరి విన్నర్ గా నిలిచింది. 

gnaneshwari on marriage with pradeep
Author
Hyderabad, First Published Mar 4, 2019, 9:58 AM IST

ప్రముఖ యాంకర్ ప్రదీప్ కోసం స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' షోని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షోలో జ్ఞానేశ్వరి విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు బ్యూటీ హీరోయిన్ గా 'మిస్టర్ అండ్ మిస్' సినిమాతో వెండితెరకి పరిచయం కానుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో లిప్ లాక్ సీన్స్ లోరెచ్చిపోయి నటించింది ఈ భామ. కెరీర్ పరంగా అమ్మడు తన ప్లాన్లు బాగానే వేసుకుంది. మరి ప్రదీప్ తో పెళ్లి సంగతేంటి..? అనేది కొందరి సందేహం. దీనికి జ్ఞానేశ్వరి సమాధానాలు చెప్పుకొచ్చింది.

ముందుగా కెరీర్ కోసం తాను 'పెళ్లిచూపులు' షోకి వెళ్లలేదని తెలిపిన ఈ భామ బుల్లితెరపై కనిపించాలనే ఆసక్తితో వెళ్లినట్లు స్పష్టం చేసింది. అలాంటి షోలో టైటిల్ ని గెలుచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. 'పెళ్లిచూపులు' షోలో పాల్గొనక ముందే కొన్ని షార్ట్ ఫిలిమ్స్, అలానే ఓ కన్నడ సినిమాలో నటించానని చెప్పింది.

పెళ్లిచూపులు షోలో విన్నర్ గా నిలిచిన మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని..? ప్రశ్నించగా.. ఆ కార్యక్రమంలో పెళ్లిచూపులు మాత్రమే జరిగాయని, పెళ్ళికి చాలా తేడా ఉందని చెప్పింది. ఆ రెండిటికీ మధ్య చాలా జర్నీ ఉంటుందని.. అయినా అప్పుడే నాకు పెళ్లేంటి..? ఇంకా టైం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios