Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ వినాయక్ అక్రమ కట్టడాలు.. కూల్చేసిన జీహెచ్ఎంసీ

దర్శకుడు వివి.వినాయక్ కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ భవన నిర్మాణాల కారణంగా అధికారులు దర్శకుడిపై సీరియస్ అయినట్లు సమాచారం. 

 

ghmc angry on vinayak illegal buildings issue
Author
Hyderabad, First Published Jun 26, 2019, 8:16 PM IST

దర్శకుడు వీవీ వినాయక్‌కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా  అక్రమ భావన నిర్మాణాల కారణంగా అధికారులు దర్శకుడిపై సీరియస్ అయినట్లు సమాచారం. 

వట్టినాగులపల్లిలో వివి.వినాయక్ అనుమతి లేకుండా ఆరు అంతస్థుల భవనం నిర్మించినట్లు తెలియగానే విచారించిన అధికారులు ట్రిపుల్ వన్ జీవోకు  వ్యతిరేకంగా ఉన్నట్లు కనుగొన్నారు. గండిపేట పరిధిలో ఉన్న వట్టినాగుల పల్లి కొత్త జిల్లాలు ఏర్పడకముందు గ్రామ పంచాయితీలో ఉండేది. జిల్లాల ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వచ్చింది. 

అయితే వట్టినాగులపల్లిలో ఉన్నప్పుడు జీ+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న వినాయక్ జీవోను లెక్క చేయకుండా జి+6 భవనాన్నీ నిర్మించసాగారు. జీహెచ్ఎంసీ ఇదివరకే   ఈ నిర్మాణాలపై సీరియస్ అయ్యింది. టౌన్ ప్లానింగ్ విభాగం మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. 

దర్శకుడు స్పందించకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఫ్లోర్లను కూల్చేశారు. ఈ విషయంపై వినాయక్ స్పందించాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios