సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అకాల మరణం చెందారు. కొంతకాలంగా రమేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అకాల మరణం చెందారు. కొంతకాలంగా రమేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీనితో ఆయన ఫ్యామిలీ, చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోదరుడిని కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. మహేష్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీనితో క్వారంటైన్ లో ఉంటున్న మహేష్ తన సోదరుడిని కడసారి చూసే వీలు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా రమేష్ బాబు అంత్యక్రియలు తాజాగా పూర్తయ్యాయి. 

రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం రమేష్ బాబు భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంకి తరలించారు. మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం రమేష్ కుమారుడు జయకృష్ణ తన తండ్రి చితికి నిప్పంటించారు. కోవిడ్ నిబంధనల కారణంగా కొద్ది మంది మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

కుటుంబ సభ్యులు నరేష్, సుధీర్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రమేష్ బాబు కృష నట వారసుడిగా అనేక చిత్రాల్లో నటించారు. అయితే హీరోగా రమేష్ బాబు ఎక్కువరోజులు నిలదొక్కుకోలేకపోయారు. వరుస పరాజయాలు ఎదురుకావడంతో రమేష్ బాబు నటుడిగా సినిమాలు వదిలేసి మహేష్ బాబుతో అర్జున్ లాంటి సినిమా నిర్మించారు. 

హీరోగా రమేష్ బాబు బజార్ రౌడీ, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు లాంటి చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అల్లూరి సీతారామరాజు చిత్రంతో రమేష్ బాబు బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఏది ఏమైనా రమేష్ బాబు అకాల మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.