ఎప్పటి నుంచో తమ అభిమాన స్టార్ నుంచి సినిమా కోసం ఎదరుచూస్తున్న ఫ్యాన్స్ కోసం.. రాక్ స్టార్ యష్.. ఓ ప్రకటన చేశాడు. కాస్త ఓపిక పడ్డండి త్వరలో గుడ్ న్యూస్ చెపుతా అన్నాడు. ఇంతకీ కన్నడ హీరో ఏం చేయబోతున్నాడు.
కేజీఎఫ్ రెండు సినిమాలతో కన్నడ సినిమా రాతను మార్చేశాడు రాక్ స్టార్ యష్.. లోకల్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కూర్చోబెట్టాడు. కన్నడ సినిమా కలెక్షన్స్ ను గ్లోబల్ బాక్సాఫీస్ వరకు తీసుకెళ్లాడు యశ్ . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ రెండు సినిమాలు ఏరేంజ్ లో సక్సెస్ సాధించాయో అందరికి తెలిసిందే. అయితే ఈరెండు సినిమాల వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇంత వరకూ యష్ తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.
యష్ నెక్ట్స్ చేసే సినిమా ఆయనకు 19వ సినిమా అవుతుంది. దాంతో నెట్టింట్లో Yash19 గురించి రకరకాల పుకార్లు వైరల్ అయ్యాయి. యష్ తో ఫలానా స్టార్ డైరెక్టర్ తో యష్ సినిమా అని.. ఓ తమిళ డైరెక్టర్ కు యష్.. యస్ చెప్పాడని.. ఇలా రకరకాల వార్లలు నెట్టింట్లో.. పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చాయి. కాని వాటిపై రాక్ స్టార్ ఎప్పుడూ స్పందించలేదు. ఇక తాజాగా తన నెక్ట్స్ సినిమాపై ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీని బ్రేక్ చేస్తూ.. ఫ్యాన్స్ కు చిన్న అనౌన్స్ మెంట్ ఇచ్చాడు కన్నడ స్టార్ హీరో.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్, అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించాడు యశ్. మలేషియాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో యశ్ 19 ఎలా ఉండబోతుందో చెప్పి అందరినీ దిల్ ఖుష్ చేశాడు యష్. మలేషియాలో ఎంఎస్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ బ్రాంచ్ ను ఇనాగ్రేట్ చేశాడు యష్. ఈ సందర్భంగా యశ్19 మూవీ గురించి మాట్లాడుతూ.. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చాలా హార్ట్ వర్క్ చేస్తున్నా. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పను.. కానీ ఇది ఒక మంచి, అద్భుతమైన సినిమా కానుంది.ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తా. కాని అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టండి. నన్ను నమ్మండి. మీ అంచనాలకు తగ్గకుండా అదిరిపోయే కిక్కించేలా సినిమా ఉంటుంది అని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు యష్.
ఇన్నాళ్ళ ఫ్యాన్స్ వేయిటింగ్ కు తెరదించుతూ.. చాలా రోజుల తర్వాత యశ్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడంతో.. అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అంతే కాదు.. కన్నడనాట బాగా పాపులర్ అయిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ యశ్‌తో 19వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు.. చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. మరి ఈ బ్యానర్ లోనే యష్ సినిమా చేస్తాడా...? చేస్తే.. డైరెక్టర్ ఎవరు..? వివరాలేంటి అనేది తెలియాలి అంటే.. కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
