Asianet News TeluguAsianet News Telugu

మరోసారి భయపెట్టబోతున్న అంజలి.. ‘గీతాంజలి పార్ట్-2’ షూటింగ్ షురూ..

తెలుగు హీరోయిన్ అంజలి నటించిన ‘గీతాంజలి’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈరోజే పార్ట్-2 షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
 

Geethanjali Part 2 Movie Shooting Begin Today Details NSK
Author
First Published Sep 23, 2023, 5:14 PM IST

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలను ఓకే చేస్తోంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, విశ్వక్ సేన్ 11 వంటి చిత్రాలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే ‘బహిష్కరణ’ అనే మరో మూవీలోనూ నటిస్తోంది. ఇప్పటికే తమిళం, తెలుగులో అంజలి స్టార్ హీరోలకు జోడీగా నటించింది. విభిన్న పాత్రలు కూడా పోషించింది. 

ఇదిలా ఉంటే.. అంజలి కేరీర్ లోనే బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన కామెడీ హారర్ ఫిల్మ్ ‘గీతాంజలి’. ఈ చిత్రానికి కోన వెంకట్ దర్శకత్వం వహించారు. 2014లో వచ్చిన ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రంలో అంజలి ద్విపాత్రాభినయం చేసింది. గీతాంజలి, ఉషాంజలి పాత్రల్లో మెప్పించింది. కామెడీ, థ్రిల్లింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ తో పాటు సీక్వెల్ ట్రెండ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గీతాంజలికీ సీక్వెల్ రాబోతోంది.

Geethanjali Part 2  కూడా రాబోతోంది. అంజలి ప్రధాన పాత్రలో కొన వెంకట్ సమర్పణలో మళ్లీ ప్రేక్షకులకు ముందుకు రానుందీ చిత్రం. ఈరోజు గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూనిట్ నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈసారి మరింతగా థ్రిల్లింగ్ అంశాలలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతోంది అంజలి. త్వరలో మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు. ఎంవీవీ మూవీస్ బ్యాన్ ర్ పై రూపుదిద్దుకుంటోంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios