సినీ నటి గాయత్రి గుప్తా తాజాగా బిగ్ బాస్ షోపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ లేకుండా వంద రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండగలవా..? అని బిగ్ బాస్ కోఆర్డినేట్స్ అసభ్యకరంగా మాట్లాడారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 'ఫిదా', 'ఐస్ క్రీమ్', 'మిఠాయి', 'అమర్ అక్బర్ ఆంటోనీ' తదితర చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తన గొంతు వినిపించింది.

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో తనకు ఆఫర్ ఇచ్చి.. అగ్రిమెంట్ చేయించుకొని.. రేటు కూడా ఫిక్స్ చేసి రెండు నెలల తరువాత ఇప్పుడు బిగ్ బాస్ షోకి సెలెక్ట్ కాలేదంటూ అన్యాయం చేశారని బిగ్ బాస్ షో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్స్ లేకుండా వంద రోజులు ఉంటావా..? అంటూ బిగ్ బాస్ నిర్వాహకులుతనకు అడిగారని సంచలన కామెంట్స్ చేసింది.

సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఇష్యూపై మరోసారి క్లారిటీ ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఛాన్స్ ఎలా వచ్చింది..? ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాలను వెల్లడించింది. మొదట తనను బిగ్ బాస్ వాళ్లు సంప్రదించినప్పుడు ఆ షోకి ఉన్న పాపులారిటీ చూసి ఒప్పుకున్నానని.. జీవితంలో ప్రైవసీ ఉండదనేది వాస్తవంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు.. తన ఇంట్లో కూడా ఒక కెమెరా ఉందనే ఆలోచనతో ఉంటేనే సేఫ్ గా బ్రతకగలుగుతానని అనుకున్నట్లు చెప్పింది.

ఆ కారణంగా బిగ్ బాస్ కి కనెక్ట్ అయినట్లు.. వాళ్లు ఆఫర్ చేసిన పేమెంట్ కూడా నచ్చడంతో బిగ్ బాస్ కి ఓకే చెప్పేశానని తెలిపింది. మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా..? అని నిర్వాహకులు అడిగినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని చెప్పినట్లు వెల్లడించింది. ఆ వ్యాధి కారణంగా బరువులు ఎత్తలేనని, పది రోజులకొకసారి ఫిజియోథెరపీ అవసరం పడొచ్చని చెప్పినట్లు తెలిపింది.

మీ వల్ల రేటింగ్స్ వస్తాయని.. ఫిజియోథెరపీ మేం చేయిస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పినట్లు వెల్లడించింది. అగ్రిమెంట్ ప్రకారం జూలై 15 నుండి 100 రోజులు వేరే ప్రాజెక్ట్స్ చేయకూడదన్నారని..దాని వలన ఐదారు సినిమాలు వదిలేశానని చెప్పింది. ఫైనల్ గా బిగ్ బాస్ కి మీరు సెలెక్ట్ కాలేదని ఫోన్ చేసి చెప్పారని.. కారణం ఏంటని ప్రశ్నిస్తే.. మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందని దాని వలన మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని షాక్ ఇచ్చినట్లు తెలిపింది.