Asianet News TeluguAsianet News Telugu

'గాండీవధారి అర్జున' OTT లో మరో ‘వైల్డ్ డాగ్’అవుతుందా?ఈ లెక్కలేందయ్యా


గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్  Netflix లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Gandeevadhari Arjuna will be streaming on OTT from this weekend jsp
Author
First Published Sep 21, 2023, 6:51 AM IST


కొన్ని చిత్రాలు థియేటర్స్ లో ఆడతాయి. మరికొన్ని ఓటిటిలో ఆడతాయి. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు కొన్ని ఓటిటిలో వర్కవుట్ కాలేదు. కానీ థియేటర్ లో డిజాస్టర్ అయిన వైల్డ్ డాగ్ వంటి చిత్రాలు ఓటిటిలో రికార్డ్ లు క్రియేట్ చేసాయి. అలా అప్పట్లో నాగార్జున ప్రధాన పాత్రలో న‌టించిన‌ చిత్రం ‘వైల్డ్ డాగ్​’కు జరిగింది. ఎన్నో అంచనాల నడుమ మార్చి 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో థియేట‌ర్‌లో విడుదలైన 19 రోజుల‌కే ఇది ఓటీటీ బాట ప‌ట్టింది. కంటెంట్‌ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్‌ డాగ్’‌ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మ దులిపింది. వ్యూస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతోంది. ‘వైల్డ్ డాగ్’ కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోవడం ద్వారా అన్ని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది.  ఇప్పుడు  ‘గాండీవధారి అర్జున’కు అలాంటి ఫీటే జరుగుతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. 

రీసెంట్ గా ఓ నెల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా  మీద రిలీజ్ కు ముందు డీసెంట్ బజ్ ఉంది.  విజువల్స్, మేకింగ్ చూస్తుంటే ఏదో మంచి స్పై థ్రిల్లర్ చూడబోతున్నారని అంచనాలుకు వచ్చారు. అయితే  సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడా సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. 

గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్  Netflix లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మిగతా భాషల గురించి ఈ ఓటీటీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక ఈ సినిమా థియేటర్ లో వర్కవుట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఓటిటిలో జనం గట్టిగా చూస్తారనే నమ్మకంతో ఉన్నారట.  

వాస్తవానికి  'గాండీవధారి అర్జున' #GandeevadhariArjuna  విడుదలకి ముందు ఈ సినిమా చాలా స్టైలిష్ యాక్షన్ సినిమాగా, అలాగే వరుణ్ తేజ్ కి ఒక మంచి బ్రేక్ కావాలి, అది ఈ సినిమాతో తీరుతుంది అని అన్నారు దర్శకుడు.  ఈ 'గాండీవధారి అర్జున లో సాక్షి వైద్య (SakshiVaidya) హీరోయిన్ గా వరుణ్ తేజ్ పక్కన నటించింది. వీకెండ్ కలెక్షన్స్ చూస్తే 'బెదురులంక 2012' సినిమా పరవాలేదు అనిపించింది, అలాగే ఈ 'గాండీవధారి అర్జున' అయితే టోటల్ డిజాస్టర్ అయింది. మొదటి రోజు మొదటి షో నుండే ఈ సినిమాకి చాలా నెగటివ్ టాక్ వచ్చింది. పాపం వరుణ్ తేజ్ కి దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో 'ఘోస్ట్' ఇచ్చాడు అని ప్రేక్షకులు అంటున్నారు అంటే ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ఊహించుకోవచ్చు.

అంతేకాదు  ఈ సినిమాలో  కీ పాయింట్ ఇంతకు ముందు సూర్య (Suriya) నటించిన 'సింగం 3' #Singam3 లో వచ్చిన పాయింటే. అదేంతో ఈ చిత్ర యూనిట్ లో ఒక్కరికి కూడా ఆ ఆలోచన ఎందుకు రాలేదో మరి. విదేశాలు తమ చెత్తని భారతదేశానికి ఎలా తరలిస్తున్నాయో, దానివల్ల ఎంతమంది భారతీయ ప్రజలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు, వింత రోగాల బారిన చాలామంది ఎలా పడుతున్నారు అన్న నేపథ్యంలో తీసిన కథ. ఆ 'సింగం 3' సినిమా కథ, ఈ సినిమా కథ ఒక్కటే, కొంచెం నేరేషన్ లో తేడా. ఈ సినిమా తెర మీద చాలా స్లోగా, బోరింగ్ గా దర్శకుడు నేరేట్ చేసాడు. సినిమా ఎక్కడా ఆసక్తికరంగా ఉండదు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios