సొట్టబుగ్గల సుందరి తాప్సి అదృష్టమేమిటో గాని బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నా రాని ఫలితం ఒకటి రెండు సినిమాలతో నార్త్ జెనాలు తెగ ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఒంటరి భయాన్ని తెరపై చూపించేందుకు రెడీ అయ్యింది. 

తాపీ నటిస్తున్న గేమ్ ఓవర్ అనే సినిమా టీజర్ ను రీసెట్ గా విడుదల చేశారు. మనిషికి రెండు లైఫ్ లు ఉంటాయన్న థాట్ తో వస్తోన్న ఈ సినిమా టీజర్ కొత్తగా ఉంది. సినిమాలో ఎక్కువగా వేరే పాత్రలేమి లేవని అనిపిస్తోంది. ఒక్క పని మనిషి మాత్రమే తాప్సితో కనిపిస్తోంది. విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి. అయితే సినిమాలో దెయ్యం ఉందా.. లేకా తాప్సి ఆలోచనలే భయాన్ని కలిగిస్తున్నాయా? అనేది తెరపై చూడాలి. 

మరి సినిమా ఎలాంటి థ్రిల్ ని ఇస్తుందో తెలియాలంటే జూన్ 14వరకు వెయిట్ చేయాల్సిందే. ముందైతే టీజర్ పై ఓ లుక్కేయండి.