`గేమ్‌ ఛేంజర్‌` రెండో పాటలో చిరు మెరుపులు‌, `రా మచ్చా మచ్చా` పాట ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇదే ఫస్ట్ టైమ్‌

`గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి రెండో పాట `రా మచ్చా` విడుదలైంది. అయితే ఈ పాట వెనుక పెద్ద కథ ఉంది. ఇలా చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. 
 

game changer second song raa macha macha out Chiranjeevi attraction and that is main special arj

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. బిగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఇంకెవరూ అప్‌ డేట్స్ ఇవ్వడానికి లేదు. ఆయన చెబితేనే అప్‌డేట్స్ బయటకు వస్తుంది. ఆయన బయటకు చెప్పడు కాబట్టి సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాక చరణ్‌ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. మధ్య మధ్యలో నిర్మాత దిల్‌ రాజు ఏదో హింట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ని కూల్‌ చేసే ప్రయత్నం చేశారు. రిలీజ్‌ అప్‌ డేట్‌ కూడా ఇచ్చారు. కానీ అది సరిపోవడం లేదు. కంటెంట్‌ పరంగా ఎలాంటి అప్‌ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింటింగ్‌తో ఉంటున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

`గేమ్‌ ఛేంజర్‌` రెండో పాట `రా మచ్చా మచ్చా` విడుదల..

ఆ ప్రెజర్‌ పెరుగుతుంది. ఫ్యాన్స్ ఏకంగా శంకర్‌ని పట్టుకుని ట్రోల్‌ చేశారు. నిర్మాతపై కూడా దారుణంగా ట్రోల్‌ చేశారు. అప్‌ డేట్స్ కావాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఎట్టకేలకు టీమ్‌ దిగొచ్చింది. శంకర్‌ అప్‌ డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. `గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి రెండో పాటని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ముందు హింట్‌ ఇచ్చారు. ఆ తర్వాత రెండో పాట వస్తుందన్నారు. ఆ తర్వాత ప్రోమో డేట్‌ ఇచ్చారు, ప్రోమో విడుదల చేశారు. అనంతరం సాంగ్‌ డేట్‌ ఇచ్చారు. ఎట్టకేలకు సోమవారం(సెప్టెంబర్‌ 30)న రెండో పాటని విడుదల చేశారు. `రా మచ్చా మచ్చా` అంటూ సాగే ఈ పాట తాజాగా విడుదలై ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. 

game changer second song raa macha macha out Chiranjeevi attraction and that is main special arj

రామ్‌ చరణ్‌ ఎంట్రీ అదుర్స్..

అభిమానుల్లో జోష్‌ నింపేలా సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. అలరించేలా ఉంది. ఫ్యాన్స్ డాన్స్ చేసేలా ఉంది. వెరైటీ డాన్స్ స్టెప్పులతో చరణ్‌ సైతం అదరగొట్టాడు. ఇన్‌ షర్ట్ ధరించి, ఒక ఆఫీసర్‌లా కనిపిస్తున్నారు చరణ్‌. ఆ లుక్ లోనే ఆయన డాన్స్ చేశారు. `కళ్లజోడు తీస్తే నీలాంటి వాడినే, షర్ట్ పైకి అంటే నీ లాంటి వాడినే` అంటూ డాన్స్ తో రంగంలోకి దిగిన చరణ్‌ తనదైన మాస్‌ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆయన డాన్స్ ఓ హైలైట్‌ అయితే, విజువల్స్ మరో హైలైట్‌. దీనికితోడు వెనకాల డాన్సర్లు ఇంకో ప్రత్యేకత. నిజంగా చెప్పాలంటే ఇదే అసలు ప్రత్యేకత. 

`గేమ్‌ ఛేంజర్` రెండో పాట ప్రత్యేకత ఇదే..

రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా తెర‌కెక్కిన ఈ పాటను శంక‌ర్ త‌న‌దైన మార్క్ చూపిస్తూ గ్రాండియ‌ర్‌గా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌  ఎన‌ర్జిటిక్‌, స్టైలిష్ లుక్‌లో అల‌రించారు. ఇక గ్రేస్‌తో ఆయ‌న వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఈ పాట‌లో  ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్  రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషం. వారి సంస్కృతులు ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. 

game changer second song raa macha macha out Chiranjeevi attraction and that is main special arj

విభిన్న సంస్కృతులకు చెందిన జానపద నృత్యాలతో `రా మచ్చా మచ్చా` సాంగ్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని పాట‌ను శంక‌ర్ వినూత్నంగా తెర‌కెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి, ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేశారు శంక‌ర్‌. ఇలా ఒక పాటలో ఇన్ని రాష్ట్రాల కల్చర్‌ని భాగం చేయడం ఇదే ఫస్ట్ టైమ్‌ అని చెప్పొచ్చు. గ‌ణేష్ ఆచార్య మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో పాట రూపుదిద్దుకుంది.  తెలుగు, తమిళం, హిందీలో న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు.  

చిరంజీవి స్పెషల్‌ ఎట్రాక్షన్‌..

ఇందులో మరో ప్రత్యేకత ఉంది. పాట మధ్యలో మెగాస్టార్‌ దర్శనమివ్వడం విశేషం. `వాల్తేర్‌ వీరయ్య` సినిమాలోని చిరంజీవి కటౌట్‌ని ఇందులో ఉపయోగించారు. ఇది ఫ్యాన్స్ కి స్పెషల్‌ ఫీస్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఓ సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్ గా నిలుస్తుంది. థియేటర్లలో ఈ సీన్‌కి ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇందులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరు కలిసి `గేమ్ ఛేంజ‌ర్‌`లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. `వినయ విదేయ రామ` తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్  గేమ్ ఛేంజ‌ర్ రెడీ అంటోంది. 

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ ఫస్ట్ టైమ్‌ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు దిల్‌ రాజు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుందని సమాచారం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తుండ‌గా తిరుణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios