ఆ మధ్యన దిల్ రాజు నిర్మాతగా ‘అదే నువ్వు అదే నేను’ టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ద్వారా శశి దర్శకునిగా పరిచయం చేయాలనకున్నారు దిల్ రాజు. టీడీపి ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఈ హీరోతో లాంచ్ చేసేందుకు ఈ సినిమాను వేదికగా చేసుకున్నారు.  నభా నటేశ్‌ జంటగా ఎంపిక చేసి లాంచ్ చేసారు. అయితే ఏం జరిగిందో ఏమో ..ఈ ప్రాజెక్టుని దిల్ రాజు ఆపేసినట్లు సమాచారం. 

ముందుగా అనుకున్నదాని ప్రకారం పిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.  స్క్రిప్టు అనుకున్న విధంగా రాకపోవటంతో ఈ సినిమాని ఆపేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై అఫీషియల్ గా సమాచారం ఏమీ లేదు.  ఇక అశోక్ ..స్వయానా హీరో మహేశ్‌బాబుకు  మేన ల్లుడే . ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు. 

చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘గల్లా అశోక్‌ను మా బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ద్వారా హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. శశి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాను’’ అన్నారు. 

అయితే ఇలా అర్దాంతరంగా ప్రాజెక్ట్ ని కాన్సిల్ చేయటం వెనక కారణం కేవలం స్క్రిప్టు బాగారాలేదన్నదేనా మరేదన్నా ఉందా అనేది తెలియాల్సి ఉంది.