Asianet News TeluguAsianet News Telugu

ఎంత ఫ్లాప్ అయితే మాత్రం.. మ‌రీ ఇలాగా?

సినిమా హిట్ అయితే ఆ టీమ్ కు వచ్చే కిక్కే వేరు. అలాగే ఈ సినిమా కు రీమేక్ రైట్స్, ఓటీటి రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్,యూట్యూబ్ రైట్స్ ఇలా ఒకటేమిటిటి అనేక రకాలుగా ఆదాయం మొదలైపోతుంది. ఫ్లాప్ సినిమాకు ఆదాయం తగ్గిపోతూంటుంది. రోజు రోజుకీ ఫ్లాఫ్ సినిమాని మీడియా, సినిమావాళ్లు అందరూ మర్చిపోతూంటారు. అయితే ఈ విషయం స్ఫష్టంగా తెలిసిన వాళ్లు వాట్ నెక్ట్స్ అనేది చూస్తారు.

Gaali Sampath premiers from March 19 jsp
Author
Hyderabad, First Published Mar 18, 2021, 4:08 PM IST

సినిమా హిట్ అయితే ఆ టీమ్ కు వచ్చే కిక్కే వేరు. అలాగే ఈ సినిమా కు రీమేక్ రైట్స్, ఓటీటి రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్,యూట్యూబ్ రైట్స్ ఇలా ఒకటేమిటిటి అనేక రకాలుగా ఆదాయం మొదలైపోతుంది. ఫ్లాప్ సినిమాకు ఆదాయం తగ్గిపోతూంటుంది. రోజు రోజుకీ ఫ్లాఫ్ సినిమాని మీడియా, సినిమావాళ్లు అందరూ మర్చిపోతూంటారు. అయితే ఈ విషయం స్ఫష్టంగా తెలిసిన వాళ్లు వాట్ నెక్ట్స్ అనేది చూస్తారు.

 ఇంకా ఆ సినిమాతో ఏమన్నా పైసలు రాలతాయేమో అని ప్రయత్నిస్తారు. ఇప్పుడు గాలి సంపత్ టీమ్ అదే చేసింది. సినిమా రిలీజ్ అయిన  నెల తర్వాత ఓటీటికు అమ్మితే హిట్ సినిమాలకు ఫరవాలేదు కానీ, ఫ్లాఫ్ సినిమాలను పట్టించుకోరు. అందుకే రిలీజ్ అయిన వారానికే తమ సినిమాని ఓటీటికు ఇచ్చేసారు గాలి సంపత్ సినిమా నిర్మాతలు. 

వివరాల్లోకి వెళితే.. శివరాత్రి కానుకగా విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ‘గాలి సంపత్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 11న విడుద‌లైంది. తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. `జాతిర‌త్నాలు` జోరుకు త‌ట్టుకోలేక‌, థియేట‌ర్లు ఖాళీ అవుతున్నాయి. అందుకే ఓటీటీలో విడుద‌ల చేసేస్తున్నారు. కాగా.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో మార్చి 19న విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా ‘ఆహా’ పంచుకుంది. థియేట‌ర్ల‌లో జ‌నాలు ఎలాగూ రాలేదు. క‌నీసం ఓటీటీలో అయినా చూస్తారని నిర్మాత‌ల‌ు ఆశిస్తున్నారు.

 శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యువ డైరెక్టర్‌ అనీశ్‌ కృష్ణ తెరకెక్కించారు. లవ్‌లీసింగ్‌ హీరోయిన్‌. తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే చూసుకోవడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇమేజ్‌ స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, షైన్‌ స్క్రీన్స్ పతాకంపై ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు, గారపాటి సంయుక్తంగా నిర్మించారు. అదేరోజు ‘ఆహా’లో ‘క్షణ క్షణం’ కూడా విడుదల కానుండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios