'గాలి సంపత్' ప్రీ రిలీజ్ బిజినెస్,ఎంతొస్తే బ్రేక్ ఈవెన్
హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా అభిమానుల అంచానలను నెక్ట్స్ స్థాయికి తీసుకువెళ్లాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ట్రైలర్ తో కేవలం ఫన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. గాలి సంపత్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా నటీనటులు నమ్మకంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...గాలి సంపత్ మొత్తం మీద 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది..ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏ ఏరియాలో ఏ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందో చూద్దాం.
నైజాం : Rs 2 కోట్లు
సీడెడ్ : Rs 1 కోట్లు
ఆంధ్రా : Rs 3 కోట్లు
ఆంధ్రా/తెలంగాణా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ : Rs 6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + ఓవర్ సీస్ : Rs 50 లక్షలు
ఈ సినిమా మొత్తం బడ్జెట్ 7 కోట్లు అవ్వగా.. 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రాబట్టింది.!! ఇది శ్రీ విష్ణు కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ .! ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 7కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాలి..!
అలాగే గాలి సంపత్ మూవీ నైజాం ఏరియా లో 141 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 410 వరకు థియేటర్స్లో రిలీజ్ అవ్వనుంది.. ఇప్పటికే అన్ని సినిమాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.