డైరక్టర్ బోయపాటి శ్రీను అంటే..రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్స్ కు ఫేమస్. ఆయన రొటీన్ కథలు గొప్పగా ఉండకపోయినా గొప్పగా ఆడుతూంటాయి. ముఖ్యంగా హీరోలని ఎలివేట్ చేయటంలో ఆయనది అందెవేసిన చేయి.యాక్షన్ బ్లాక్స్ తో అదరకొట్టే ఆయన సినిమాలు ఓ బ్రాండ్ గా మారాయంటే అతిశయోక్తి కాదు.అయితే ఆయన సినిమాలపై సోషల్ మీడియాలో జోక్స్ ,ట్రోలింగ్, మెమోస్ కూడా వస్తూండటం కూడా అంతే కామన్.

తాజాగా ఆయన రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్న వినయ విధేయరామ చిత్రానికి సంభందించి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసారు. తందానే..తందానే అంటూ సాగే ఆ పాట ఫ్యామిలీ సెంటిమెంట్ తో సాగుతుంది. ఈ పాటకు సంభదించిన పోస్టర్ సైతం జనాల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఆశ్చర్యంగా డైరక్టర్ ని ఉద్దేసిస్తూ మంచి ఫన్నీగా మెమోలు పడుతున్నాయి. 

ఓ హ్యాపీ ఫ్యామీలి సీన్ ని ఎస్టాబ్లిష్ చేసారంటే..ఆ తర్వాత వాళ్లను పెద్ద బాంబ్ పేలుడులో చంపేస్తాడని ఫన్నీగా నవ్వుకుంటున్నారు. బోయపాటి స్టైల్ లో ఆయన గత చిత్రాల యాంగిల్ లోంచి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దానికి తోడు వినయ విధేయ రామా అనే సాప్ట్ టైటిల్ పెట్టి హింసతో కూడిన యాక్షన్ చూపిస్తాడనేది కూడా నిజం.  అయితే ఎవరు ఎన్ని వెటకారాలు చేసినా, ఆడుకున్నా..బోయపాటి పెద్ద హిట్ తో వాళ్లకు సమాధానం చెప్తూంటారు.