అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. ఆడాళ్ళను జడ్జి చేసేవాళ్లను ఉద్దేశిస్తూ ఒక సెటైరికల్ వీడియో షేర్ చేశారు.
నటి అనసూయ డ్రెస్సింగ్ అనేకసార్లు వివాదాస్పదమైంది. బుల్లితెర షోలలో ఆమె స్కిన్ షో చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గలేదు. పైగా తనని తాను సమర్ధించుకున్నారు. నా బట్టలు నా ఇష్టం. నేను ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరు. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా ధరిస్తా.. అంటూ అనసూయ కౌంటర్లు ఇచ్చారు. ఆ మధ్య సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు... అనసూయ అందంగా ఉంటుంది. ఆమె కురచ దుస్తులు వేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేశాడు.
సీనియర్ నటుడని కూడా చూడకుండా కోటాకు అనసూయ ఇచ్చిపడేసింది. తీవ్ర పదజాలంతో ఆయనపై విరుచుకుపడింది. ఆడవాళ్లపై మీ పరిమితులు ఏంటి? మమల్ని జడ్జి చేయడానికి మీరెవరు? అంటుంది ఆమె. తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఇదే విషయం ప్రస్తావిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. 'మహిళలు పిల్లల్ని కనమని, కనొద్దని... జాబ్ చేయాలని చెయ్యొద్దని... లావు గా ఉండాలని కాదు బక్కగా ఉండాలని జడ్జి చేయబడుతున్నారు' అంటూ అసహనం తెలియజేస్తున్న ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో బూతు పదాలతో నిండి ఉన్న నేపథ్యంలో అనసూయ ఫ్రస్ట్రేషన్ లో బూతుల వీడియోలు షేర్ చేస్తున్నారంటున్నారు .
అయితే అనసూయ యాంకరింగ్ పూర్తిగా మానేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా ఆమెకు బుల్లితెర వివాదాలకు దూరమయ్యారు. అసలు యాంకర్ గా తాను చేసే పనులు కొన్ని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుందని పరోక్షంగా చెప్పారు. ఇటీవల బుల్లితెర షోల మీద భయంకరమైన ఆరోపణలు చేసింది. షో నిర్వాహకులు టీఆర్పీ కోసం పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని అవి తనకు నచ్చక యాంకరింగ్ మానేసినట్లు పరోక్షంగా చెప్పారు. అనసూయ ప్రధానంగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని టార్గెట్ చేయడం విశేషం.
అలాగే నటిగా బిజీగా ఉన్న అనసూయకు యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అధికారికంగా పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 3 లక్షలు తీసుకుంటున్నారట. పుష్ప 2లో అనసూయ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ రోల్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల అనసూయపై సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. దీనిపై అనసూయ యుద్ధమే చేస్తున్నారు. మితిమీరి ప్రవర్తించిన వారిమీద చర్యలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేసి జైలుపాలు చేసింది. నెటిజన్స్ కామెంట్స్ ని సాధారణంగా సెలెబ్రిటీలు పట్టించుకోరు. అనసూయ మాత్రం రియాక్ట్ అవుతుంది. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది.
