అత్యంత సంపాదన పరులైన భారతీయ సెలబ్రిటీల లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఏడాదికి సల్మాన్ సంపాదన రూ.253 కోట్లు అని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక మన టాలీవుడ్ లో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. 

అయితే నేషనల్ వైడ్ గా పవన్ ఏడాదికి రూ.31.33 కోట్లు సంపాదిస్తూ 24వ స్థానంలో నిలవగా, ఆ తరువాతి స్థానాల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్, కొరటాల శివ వంటి సెలబ్రిటీలు నిలిచారు 

ఇక సల్మాన్ తరువాత రెండో స్థానంలో టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి నిలిచాడు. అతడి సంపాదన రూ.228 కోట్లు.. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ రూ.185 కోట్లతో ఉండగా నాలుగో స్థానం బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొన్ దక్కించుకుంది. ఆమె వార్షిక సంపాదన రూ.114 కోట్లు అని ఫోర్భ్స్ వెల్లడిస్తోంది. 

ఫోర్బ్స్ జాబితాలో టాలీవుడ్ సెలబ్రిటీల స్థానం, వారి వార్షిక సంపాదన 
పవన్ కళ్యాణ్......................24వ స్థానం (రూ.31.33 కోట్లు)
ఎన్టీఆర్....................................28వ స్థానం (రూ.28 కోట్లు)
మహేష్ బాబు........................33వ స్థానం (రూ.24.33 కోట్లు)
నాగార్జున..................................36 వ స్థానం (రూ.22.25 కోట్లు)
కొరటాల శివ.............................39 వ స్థానం (రూ.20 కోట్లు)
అల్లు అర్జున్............................64 వ స్థానం (15.67 కోట్లు)
రామ్ చరణ్...............................72 వ స్థానం (రూ.14 కోట్లు)