ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు.. గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. వరస  ఫ్లాఫ్ లు ఆమె కెరీర్ ని దెబ్బ కొట్టేసాయి. దాంతో ఆమధ్యన  హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. సీనియర్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేసింది. అయినా అక్కడా వెలుగు ప్రారంభం కాలేదు.  మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా, ఆ పేరు అవకాశాలను తెచ్చి పెట్టలేదు. ముఖ్యంగా రకుల్ తెలుగులో నాగార్జునతో  చేసిన 'మన్మథుడు 2' డిజాస్టర్ తో మరీ వెనకపడి పోయింది.  

తనతో పాటు సినీ రంగంలోకి వచ్చిన మిగతా హీరోయిన్లతో పోలిస్తే, రకుల్ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవటం ఆమెను బాధిస్తోంది. ఈ విషయాన్ని గమనించి రకుల్ ఆలోచనలో పడింది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన రకుల్, తాను వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తూ, అందాలను ఆరబోయటమే, పెద్ద తప్పయి పోయిందని వాపోయింది. 

నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని, అదే తనకు ఇప్పుడు అవకాశాలు తగ్గేలా చేసిందని అభిప్రాయపడిందని, తాను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అనుకున్న సమయానికే షూటింగ్ కు వెళ్లేదాన్నని చెప్పింది. గ్లామరస్ గా కనిపించే పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చిందని వ్యాఖ్యానించింది. 

అయితే సీనియర్ హీరోల ప్రక్కన ఆమె చేయటంతో కుర్ర హీరోలెవరూ ఆమెను దగ్గరకు చేరనీయటం లేదనేది వాస్తవం. అలాగే ఆమె క్రేజ్ తగ్గినా రెమ్యునేషన్ తగ్గక పోవటం కూడా ఆమె వెనకబడేలా చేసింది. ఆటు పోట్లు కు అణుగుణంగా ఆమె తన రెమ్యునేషన్ ని సవరించుకుంటూ ఉంటే ఈ స్దితి వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు. ఎవరెన్ని చెప్పినా..హిట్ లో ఉన్న వాళ్లకే ఆఫర్స్. టాలెంట్, అందం కన్నా హిట్టే ఇక్కడ హిట్లర్ ని చేస్తుంది.