మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలామో చాలా కాలం నుంచి కొనసాగి చివరకు థియోటర్స్ లో రిలీజ్ అయ్యింది. దాదాపు 9 నెలల తర్వాత రిలీజైన ఈ భారీ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందనే విషయమై సిని పరిశ్రమలో చర్చ మొదలైంది. ఇన్ని రోజులు కేవలం ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసిన ప్రేక్షకులు మళ్లీ ధియోటర్ కు వస్తారా రారా అనే అనుమానం అందరినీ తొలిచేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మిగిలిన సినిమాలు విడుదల చేయాలని వాళ్ళంతా  అనుకున్నారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే సినిమా విడుదలైంది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు.ఈ నేపద్యంలో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది చూద్దాం.

అయితే తొలి రోజు ఈ సినిమాకు  వచ్చిన రెస్పాన్స్ ఊహించినట్లు మాత్రం లేదు. ఏదో తొమ్మిది నెలల తర్వాత ఒక పెద్ద సినిమా విడుదలైంది అనే థియేటర్ కు వెళ్లాం అనే సంతృప్తి మినహాయిస్తే.. మంచి సినిమా చూశాం ఫీల్ మాత్రం తీసుకురాలేకపోయింది సోలో బ్రతుకే సో బెటర్. బాగా తెలిసిన కథకు రెగ్యులర్ కమర్షియల్ అంశాలు జోడించి సుబ్బు ఈ కథను రాసుకున్నాడని రివ్యూలు వచ్చాయి.  

ఈ చిత్రం క‌లెక్ష‌న్ల‌పై ట్రేడ్ లో వినపడుతున్న దాని ప్రకారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో ఫస్ట్ వీకెండ్ లో రూ.10.08 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు టాక్‌. 50 శాతం ఆక్యుపెన్సీతో 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన‌ట్టు చెప్తున్నారు. అలాగే సాయి గత చిత్రం ప్ర‌తీ రోజు పండ‌గే చిత్రం వ‌సూళ్ల‌కు..సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా మూవీ క‌లెక్ష‌న్ల‌కు దాదాపు స‌మానంగా ఉండ‌టం చెప్పుకోదగ్గ విషయం. అంటే సాధార‌ణ ప‌రిస్థితులున్నపుడు విడుద‌లైన ప్ర‌తీరోజు పండ‌గేతో పోలిస్తే కేవ‌లం 3 రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో ఇంత‌మొత్తంలో క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం ఆశ్చర్యమే అంటున్నారు.త

 ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. పండగ చేసుకో లాంటి సినిమా తరవాత సాయి తేజ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉండటం ప్లస్ అయ్యింది.