సూపర్‌ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్‌ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్‌ల మధ్య వచ్చే గ్యాప్‌లో కూడా ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు వెళ్లటం మహేష్ బాబుకు అలవాటు. ఇప్పుడు సుధీర్ఘ హాలీడే రావటంతో పూర్తి సమయం పిల్లలకే కేటాయించాడు మహేష్. గొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా తను ఇంట్లో ఉంటాడు. ఎలా టైం స్పెండ్ చేస్తాడు లాంటి విషయాలను  కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఇటీవల కూతురితో కలిసి టీవీ చూస్తున్న ఫోటోలు, రాత్రి నిద్రపోయే ముందు మహేష్ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఫోటో ను షేర్ చేసింది నమ్రత శిరోద్కర్‌. ఇన్నేళ్ల కెరీర్‌ లో మహేష్ బాబు ఎప్పుడూ తెర మీద షర్ట్ లేకుండా కనిపించలేదు. కేవలం వన్‌ నేనొక్కడినే సినిమాలో ఒక్కషాట్‌ లో మాత్రమే అలా కనిపించాడు. కానీ ఆ ఒక్క షాట్‌ కూడా మహేష్‌ను వెనుక నుంచి మాత్రమే చూపిస్తారు. అంతే అంతకు మించి ఏ సినిమాలో కూడా షర్ట్‌ విప్పి కనిపించలేదు  మహేష్‌.

అయితే తెర మీద కాకపోయినా.. పర్సనల్‌ టైంలో మహేష్ షర్ట్ లేకుండా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మహేష్, కూతురు సితార‌తో కలిసి సరదాగా స్విమ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది నమ్రత. ఈ  ఫోటోలో మహేష్ షర్ట్‌ లేకుండా ఉన్నాడు. తొలిసారిగా సూపర్‌ స్టార్‌ను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. తెర మీద ఎప్పుడూ షర్ట్ లేకుండా కనిపించేందుకు ఇష్టపడని మహేష్, ఇలా పర్సనల్ ఫోటోను ఎలా షేర్ చేశాడా అని ఆలోచనలో పడ్డారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది స్టార్టింగ్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు మహేష్. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని చెప్పినా ఆ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఈ లోగా కరోనా ప్రభావం మొదలు కావటంతో తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు మహేష్. అయితే గీత గోవిందం ఫేం పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Getting ready for a lap !! My water babies 💕💕💕#lockdown #stayhome

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 18, 2020 at 7:03am PDT