Asianet News TeluguAsianet News Telugu

వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సింగిల్...ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందా! 

సంక్రాంతి హీటు మొదలైంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల అప్డేట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నారు. చిరంజీవి 'బాస్ పార్టీ' అంటూ అలరించగా, బాలయ్య రేపు ఫస్ట్ సింగిల్ తో సందడి చేయనున్నాడు. 
 

first single from balakrishna veerasimhareddy movie
Author
First Published Nov 24, 2022, 9:32 PM IST


బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. వీరసింహారెడ్డి మూవీ ఫస్ట్ సింగిల్ కి వేళయింది. నవంబర్ 25 ఉదయం 10:29 నిమిషాలకు బాలయ్య మాస్ యాంథమ్ విడుదల చేయనున్నారు. 

ఊరి జానాలతో జై కొట్టించుకుంటూ, పూల స్వాగతం అందుకుంటున్న బాలయ్య లుక్ అదిరిపోయింది. తెల్లబట్టలో ఆయన సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి చిత్రాలను గుర్తు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెరిగిపోయాయి ఈ సాంగ్ ఖచ్చితంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని నమ్ముతున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరసింహారెడ్డి మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ వినిపిస్తుంది.  ఇక అఖండ మూవీతో బాలకృష్ణ హిట్ ట్రాక్ ఎక్కారు. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న బాలకృష్ణ బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు. బాలయ్య కెరీర్లో అఖండ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వీరసింహారెడ్డి మూవీతో ఆయన ఆ విజయపరంపర కొనసాగిస్తారని భావిస్తున్నారు. 

అలాగే చాలా కాలం తర్వాత సంక్రాంతి బరిలో చిరంజీవి-బాలయ్య పోటీపడుతున్నారు. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బలాబలాలు తేల్చుకోనున్నారు. దీంతో సంక్రాంతి సమరం రసవత్తరంగా మారింది. చివరిగా చిరంజీవి ఖైదీ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతి కానుగా విడుదలయ్యాయి. రెండు హిట్ టాక్ తెచ్చుకోగా... కలెక్షన్స్ లో ఖైదీ 150 పై చేయి సాధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios