కమల్ - మణిరత్నం చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది,చూసారా?
‘నాయకన్’ సినిమా విడుదలైన 36ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కొత్త చిత్రం కోసమే వారిద్దరూ తిరిగి చేతులు కలిపారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

దర్శకుడు మణిరత్నం (Mani Ratnam), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ (నాయకుడు)తో వారు సృష్టించిన సంచలనం ఆ రేంజిలో ఉంది. మొత్తనికి రీసెంట్ గా ఫ్యాన్స్ నిరీక్షణకు కమల్ తెరదించారు. తాను మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దాంతో కమల్, మణిరత్నం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారు ఒకటే మాట అంటున్నారు అదే సూపర్బ్.
హీరోగా కమల్‌కు ఇది 234వ (#KH234) సినిమా. మద్రాస్ టాకీస్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ గెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఆ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘బిగిన్ ది బిగిన్’ పేరుతో ఓ ప్రోమోని విడుదల చేశారు. అందులో ‘నాయకుడు’ సినిమాలోని కమల్, ప్రదీప్ శక్తి మధ్య వచ్చే ఐకానిక్ సీక్వెన్స్‌ను చూపించారు. ‘నాయకుడు’.. కమల్ - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. ఇది 1987లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలైన 36ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కొత్త చిత్రం కోసమే వారిద్దరూ తిరిగి చేతులు కలిపారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి యాక్షన్: అన్బు-అరివు, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ఛాయాగ్రహణం: రవి కె.చంద్రన్.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఆరో చిత్రం ‘నాయకన్’. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా 1987లో విడుదలై, ఘన విజయం అందుకుంది. మణిరత్నం, కమల్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది ‘విక్రమ్’ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ అందుకున్న కమల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. శంకర్ దర్శత్వం వహిస్తున్నారు. మణిరత్నం ఈ మధ్యనే ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు పార్ట్ లతో మనని పలకరించారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓకే అనిపించుకున్నా తమిళంలో మంచి ఆదరణ పొందింది.