రణబీర్ కపూర్ హీరోగా, శ్రద్దా కపూర్ నటిస్తున్న ఒక సినిమా సెట్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని చిత్రకూట్ స్టూడియోలో ఈ సినిమా కోసం సెట్స్ వేస్తుండగా... ఈ క్రమంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ యంగ్ స్టార్ మీరో రణబీర్ కపూర్ హీరో గా లవ్ రంజన్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో సడెన్ గా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబై అంధేరీలోని చిత్రకూట్ మైదానంలో వేసిన సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు టెక్నీషియన్ మృతి చెందారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్ మొత్తానికి మంటలు వ్యాప్తించాయి. ప్రమాదంలో మనీశ్ దేవాశీ అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు.
ఇక ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 12 కి పైగా ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హీరో, హీరోయిన్లు షూటింగ్ స్పాట్ లో లేకపోవడం వల్ల వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నిప్రమాదంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్టూడియోలో ప్లాస్టిక్, థర్మాకోల్‌తో కూడిన సెట్ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టంగా మారిందని సమాచారం. అయితే సకాలంలో అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో..ఎట్టకేలకు అవి అదుపులోకి వచ్చాయని తెలుస్తోంది. .. సెట్స్‌లో ప్రీ లైటింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. లవ్ రంజన్ డైరెక్షన్ లో ఒక పాటను తెరకిక్కిచ్చడానికి ప్లాన్ చేస్తున్న టైమ్ లోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తొలుత బయటకు రాలేదు.. మంటలు అదుపులోకి తీసుకు వచ్చాక మనీశ్ దేవాసీ అనే 32 ఏళ్ల సెట్ బాయ్ మరణించారని గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫైర్ ఆఫీసర్లు తెలిపిన్ ఇన్ఫర్ మేషన్ ప్రకారం ఇది లెవల్ 2 అగ్నిప్రమాదం అని తెలుస్తోంది.
