గడచిన రోజులు మళ్ళీ తన జీవితంలోకి రాకూడదు అంటుంది సమంత. చీకటి రోజుల నుండి బయటపడితేనే తిరిగి విషయం సాధిస్తామని అన్నారు. నాగ చైతన్యతో విడాకుల మీద ఆమె ఓపెన్ అయ్యింది.
సమంత రూత్ ప్రభు కెరీర్ పరంగా మోస్ట్ సక్సెస్ఫుల్. 14 ఏళ్ల సినీ ప్రస్థానం లో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఏమాయ చేసావే ఆమె డెబ్యూ మూవీ. వరుస హిట్స్ తో స్టార్ లేడీగా ఎదిగింది. సౌత్ ఇండియా టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ఇక మిడిల్ క్లాస్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చిన సమంత... ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో రాణించింది. అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక ఒడిదుడుకులు చవి చూసింది.
ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు ఆమెను మానసికంగా క్రుంగదీసిన పరిణామం. సమంత డెబ్యూ మూవీలో నాగ చైతన్య హీరో. వీరు 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు సమంత-నాగ చైతన్యల వైవాహిక బంధం అన్యోన్యంగా సాగింది. 2021 ప్రారంభంలో విడాకుల పుకార్లు తెరపైకి వచ్చాయి. అప్పటికే సమంత-నాగ చైతన్య విడివిడిగా ఉంటున్నారు. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటించారు.
విడిపోయాక నాగ చైతన్య పూర్తిగా సైలెంట్ అయ్యాడు. సమంత అప్పుడప్పుడు తన అసహనం బయటపెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్ల కాలం అత్యంత కష్టంగా గడిచిందని ఆమె అన్నారు. ఆ రోజులు మళ్ళీ నా జీవితంలోకి రాకూడదని కోరుకుంటున్నాను, అని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. చీకటి రోజులను అధిగమిస్తేనే మనం విజయం సాధించగలం.
నేను ఇప్పుడు ధృడంగా తయారయ్యాను. గతంలో వెనక్కి తిరిగి చూస్తే నా వెనుక ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను నా మిత్రులతో కూడా చెప్పాను. ఆధ్యాత్మిక చింతన నాకు ఉపశమనం కలిగించింది. మానసిక వేదన నుండి బటయపడేసిందని... సమంత చెప్పుకొచ్చారు. సమంత ఇక్కడ చెబుతున్న కష్టకాలం నాగ చైతన్యతో విడాకులే. ఆమె పరోక్షంగా ఈ విషయాన్ని తెలియజేసింది.
విడాకుల వేదన నుండి బయటపడిన సమంతను వెంటనే మరో సమస్య వెంటాడింది. ఆమె అరుదైన మయోసైటిస్ బారిన పడింది. ఏడాదిన్నరకు పైగా సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఆమె పలు వైద్య విధానాలు ఆచరించింది. ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే... మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. ఈ చిత్రానికి ఆమె నిర్మాత కూడాను. వరుణ్ ధావన్ కి జంటగా హనీ బన్నీ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న హనీ బన్నీ త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
