టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తరం నుంచి ఇప్పటి అల్లు అర్జున్ వరకు స్టార్ హీరోలకు తిరుగులేని చిత్రాలు అందించారు. రాఘవేంద్రరావు 100కు పైగా చిత్రాలతో దశాబ్దాల కాలం పాటు అగ్ర దర్శకుడిగా కొనసాగారు. 

రాఘవేంద్ర రావు వారసత్వంతో ఆయన తనయుడు ప్రకాష్ దర్శకుడిగా మారారు. కానీ ప్రకాష్ దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆయన తెరక్కించిన తొలి రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. 

మూడవ ప్రయత్నంగా బాలీవుడ్ కు వెళ్ళాడు. కంగనా రనౌత్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న ప్రకాష్ జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రాన్ని తెరక్కించాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రానికి మంచి రివ్యూలు ఇస్తున్నారు. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు పాత్రలని అద్భుతంగా తెరక్కించడంటూ ప్రకాష్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. థ్రిల్లర్ అంశాలు కూడా బావున్నాయనే టాక్ వస్తోంది. దర్శకేంద్రుడి తనయుడిగా ప్రకాష్ ఎట్టకేలకు ఓ విజయం సొంతం చేసుకున్నాడు.