రష్మిక మందాన-బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య ఎఫైర్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు.
స్టార్ లేడీ రష్మిక మందాన తరచుగా ఎఫైర్ వార్తలు ఎదుర్కొంటున్నారు. విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఓ బాలీవుడ్ ఈవెంట్లో ఇద్దరూ కలిశారు. అలాగే ఒకటి రెండు సందర్భాల్లో ఎయిర్ పోర్ట్ లో జంటగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్-రష్మిక ఎఫైర్ నడుపుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ పుకార్ల మీద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించారు.
రష్మికతో నేను డేటింగ్ చేస్తున్నాను అన్నమాట అబద్ధం. అసలు ఆమెను కలిసేదే తక్కువ. మేము స్నేహితులం మాత్రమే. వృత్తిరీత్యా తరచుగా హైదరాబాద్ నుండి ముంబై వెళుతూ ఉంటాము. ఆ టైం లో ఒక్కోసారి ఎయిర్ పోర్ట్ లో కలుస్తాము. మేము కలిసి ప్రయాణం చేసింది కూడా లేదు. రెండు మూడు సందర్భాల్లో ఇద్దరం పక్కపక్కనే కనిపించేసరికి పుకార్లు లేపారు. రష్మికతో స్నేహానికి మించి ఎలాంటి బంధం లేదని... ఆయన చెప్పుకొచ్చారు.

ఛత్రపతి హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియో నిర్మిస్తున్నాయి. మే 12న ఛత్రపతి విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సాయి శ్రీనివాస్ పాల్గొంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్ లో తనకు ఇమేజ్ తెస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ భావిస్తున్నారు. ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం అల్లుడు అదుర్స్ ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్ కి వెళ్లి అక్కడ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఇక దర్శకుడు వివి వినాయక్ కూడా తెరమరుగయ్యే పరిస్థితి ఉంది. ఖైదీ 150 తర్వాత ఆయనకు సరైన విజయం దక్కలేదు. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి రీమేక్ ఈ ఇద్దరికీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
