బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ ఇటీవల తనకు రెమ్యూనరేషన్ గా ఎంత ఇచ్చారో బయటపెట్టింది. ఆమెకు అన్ని లక్షలు ఇచ్చారని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.  

బిగ్ బాస్ సీజన్ 4 భారీ సక్సెస్ అందుకుంది. లాంచింగ్ అండ్ ఫినాలే ఎపిసోడ్స్ తో పాటు ఓవరాల్ గా షో టీఆర్పీ దుమ్ముదులిపింది. మొదట్లో సీజన్ 4 అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఆడియన్స్ భావించారు. కారణం తొంబై శాతం కంటెస్టెంట్స్ పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు. తెలియని ముఖాలు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో టాప్ సెలెబ్రిటీలు హౌస్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఎంపికైన ప్రతి కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్లే ముందు రెండు వారాలు క్వారంటైన్ చేయాలన్న నిబంధన పెట్టారు. 

ఈ క్రమంలో గంగవ్వ వంటి సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా ఛాన్స్ దక్కింది. అసలు గంగవ్వ ఎంపికే ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. ఒక పల్లెటూరి వృద్ధ మహిళ బిగ్ బాస్ షోలో ఎలా మసలుకుంటారనే ఉత్సుకత కలిగించింది. గంగవ్వ తన మార్కు చూపించింది. గంగవ్వ హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ప్రేమ సంపాదించింది. పల్లెటూళ్ళో పనీపాటా చేసుకుంటూ నలుగురిలో కలివిడిగా తిరిగే గంగవ్వ నాలుగు గోడల మధ్య ఉండలేకపోయారు. కుటుంబ సభ్యులు, ఇల్లు, ఊరు గుర్తొచ్చి ఆమె హోమ్ సిక్ కి గురయ్యారు. దీంతో అనారోగ్యం బారినపడ్డారు.

ఇక డాక్టర్స్ సలహా మేరకు గంగవ్వను ఎలిమినేట్ కాకుండానే బయటకు పంపేశారు. ఊర్లో ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో బిగ్ బాస్ షోకి వచ్చాను. అది తీరకుండానే వెళ్ళిపోతున్నాని గంగవ్వ హోస్ట్ నాగార్జునతో అన్నారు. నీ కల నేను నెరవేరుస్తాను. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన డబ్బులు ఇస్తానని అందరి ముందు నాగార్జున హామీ ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్న నాగార్జున గంగవ్వకు రూ. 7 లక్షలు ఇచ్చారు. రూ. 20 లక్షలతో గంగవ్వ తమ ఊరిలో కొత్త ఇల్లు కట్టుకుంది. 

ఇటీవల ఆమె ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేస్తుందో వివరించారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు రూ. 10 లక్షలు ఇచ్చారట. ఇక నాగార్జున రూ. 7 లక్షలు ఇచ్చాడట. మొత్తం రూ. 17 లక్షలు సమకూరాయి. తన వద్ద ఉన్న మిగతా డబ్బులతో ఇల్లు పూర్తి చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇక కేవలం ఐదు వారాలున్న గంగవ్వ పది లక్షలు సంపాదించినట్లు క్లారిటీ వచ్చింది. వారానికి రెండు లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా...