సారంగ దరియా సాంగ్ లిరికల్ వీడియో విడుదల అయిన నాటి నుండి వివాదం కొనసాగుతుంది. వివాదం పెద్దది అవుతున్న తరుణంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
లవ్ స్టోరీ మూవీలోని సారంగ దరియా సాంగ్ వివాదాలకు కేంద్ర బిందువుకు మారిన విషయం తెల్సిందే. సారంగ దరియా సాంగ్ లిరికల్ వీడియో విడుదల అయిన నాటి నుండి ఈ వివాదం కొనసాగుతుంది. వరంగల్ కి చెందిన కోమల అనే మహిళ.. అది నా పాట అంటూ మీడియాను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా వాడుకోవడంతో పాటు, తనతో కాకుండా వేరే సింగర్ తో పాడించినందుకు కోమల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు .
ఈ పాటను సినిమాకు దగ్గట్టుగా మార్పులు చేసి రచించిన సుద్దాల అశోక్ తేజ.. కోమల ఆరోపణలపై స్పందించారు. జానపదాలు ఏ ఒక్కరి సొత్తు కాదని ఆయన చెప్పడం జరిగింది. అయితే చిలికి చిలికి గాలివాన అన్న తీరుగా వివాదం పెద్దది అవుతున్న తరుణంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
సారంగ దరియా సాంగ్ ఏళ్ల క్రితం విన్నప్పుడు తనకు బాగా నచ్చిందని.. ఆ పాటలను ఈ సినిమాకు వాడాలని అనుకున్నారట. అయితే మొదట్లోనే కోమలతో ఈ సాంగ్ తమ సినిమాకు వాడుతున్నట్లు తెలియజేశారట. ఆమెనే పడాలని కూడా కోరారట. అయితే ఆమె అనేక కారణాల చేత రాలేనని చెప్పారట.
లాక్ డౌన్ సమయంలో ఒరిజినల్ సింగర్ కోమల పాడిన ట్రాక్ లో సాంగ్ షూటింగ్ చేశారట. తరువాత ఆ పాటను మంగ్లీ చేత పాడించినట్లు తెలియజేశారు. సినిమాలో పడకున్నా.. ఆడియో వేడుకలో స్టేజ్ పై పాడాలని, తనకు కూడా గుర్తింపు వస్తుందని శేఖర్ చెప్పారట. సినిమాలో క్రెడిట్ తో పాటు, డబ్బులు కూడా ఇస్తానని కోమలకు చెప్పినట్లు శేఖర్ అంటున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉండి... ఈ వివాదంపై స్పందించలేదని శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు.
